CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జోలె పట్టి దండం పెట్టి అయ్యా కలెక్టర్ గారు మా భూములు మాకు ఇవ్వండి అంటూ అర్జి స్తున్న న గిరిజనులు,చర్ల

Share it:





 మన్యం టీవీ చర్ల :

 చర్ల మండల కేంద్రంలోని చర్ల తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత పది రోజులుగా మా భూమి మాకు ఇవ్వాలంటూ సమ్మె చేస్తున్న గిరిజనులు  కలెక్టర్ గారు మా భూములు మాకు ఇవ్వండి అంటూ మోకాళ్లపై నిల్చొని రెండు చేతులెత్తి దండం పెట్టి జోలె పట్టి అర్థిoచడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ గత పది రోజులుగా సర్వే నెంబర్ 53 లోని 16 ఎకరాల పట్టాలు ఉన్న గిరిజనుల భూమి వారికే  కావాలంటూ చర్ల తాసిల్దార్ గారికి మోర పెట్టుకుంటూ సమ్మె చేయడం జరుగుతుందని, సర్వే నిర్వహించి మీ భూమి మీకు ఇప్పిస్తాను అన్న రెవెన్యూ అధికారులు ఈరోజు సర్వే నిర్వహించామని ఆ సర్వే ఫలితాలు ని కలెక్టర్ గారికి పంపించామని  ఆ సర్వే కి సంబంధించిన ప్రతులను మాకు ఇవ్వడం జరిగింది. అందులో ఈ సర్వే నెంబర్ 53 లేదని, చర్ల లోని రైస్ పేట చెక్కులో కేవలం 49 సర్వే నెంబర్ వరకే ఉందని  కాబట్టి అట్టి భూమికి మీకు ఎటువంటి సంబంధం లేదని   ఈ సమాచారాన్ని నేను కలెక్టర్ గారికి ఇచ్చానoటూ ఏమైనా ఉంటే కలెక్టర్ గారి తో మాట్లాడండి అని చెప్పడం జరిగిందని అన్నాడు.

 గత 15 సంవత్సరాల క్రితం నాటి నాడు ప్రభుత్వం అప్పుడు మేము పోడు చేసి చదును చేసిన భూమికి, ఇప్పుడు మేము మాది అంటున్న అదే భూమికి నాటి  కలెక్టర్ , ఐటీడీఏ పీవో , ఎమ్మెల్యే , స్థానిక ఎమ్మార్వో  చేతుల మీదగా 53 సర్వే నెంబర్ తో ఇరవై ఎనిమిది మంది గిరిజన మహిళలకి 16 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. ఆ విధంగా నాడు ఈ పట్టాలు ఇచ్చి  ఇప్పుడు సర్వేనెంబర్ లేదని భూమి లేదని ఆ భూమికి మీకు ఎటువంటి సంబంధం లేదని అనడం దుర్మార్గం అని అన్నాడు.

 చర్ల రెవెన్యూ అధికారులు నిరుపేదలైన గిరిజనులకు సంబంధించిన భూమి విషయంలో ఈ విధంగా చేతులెత్తేయడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. రెవిన్యూ డిపార్ట్మెంట్ వారు చేసిన తప్పిదానికి గిరిజన మహిళలని బలి చేయడం, మోసగించడం, వారి భూమి లాక్కొని వారి ఫోటో కొట్టడం ఎంతవరకు న్యాయమని అన్నారు . చర్ల రెవెన్యూ వారు చెప్పిన విధంగా గిరిజనులకు తప్పుడు సర్వే నెంబర్లు వేసి భూమి లేకుండా చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ గిరిజనులు పోడు చేసిన భూమికి నాడు పట్టాలు ఇచ్చారని ఇప్పుడు ఆ భూమికి గిరిజనులకు సంబంధం లేదని అనడంలో అర్థం లేదు అని అన్నాడు. గిరిజనులను రక్షించాల్సిన గిరిజన అధికారులు ఈ రకంగా గిరిజన నుండి భూమి లాక్కోవడానికి గిరిజనుల నుండి భూమిని దూరం చేయడానికి ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పుడు ఈ గిరిజనులకి కలెక్టర్ గారే దిక్కు అని అన్నారు. అందుకనే కలెక్టర్ గారు  మాకు మీరు తప్ప వేరే దిక్కు ఎవరూ లేరంటూ మోకాళ్లపై నిల్చొని రెండు చేతులెత్తి దండం పెడుతూ జోల పట్టి కలెక్టర్ గారు మా భూములు మాకు ఇవ్వండని ఆర్ధిస్తున్నాము అని అన్నాడు . ఇది చూసి అయినా కలెక్టర్  స్పందించి, మానవతా దృక్పథంతో టి ఈ సమస్యను అర్థం చేసుకొని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని   ఈ సమస్యలో జోక్యం చేసుకొని పరిశీలించి గత 15 సంవత్సరాలుగా పట్టాలు ఉండి  ఈ 16 ఎకరాల కి హక్కుదారులు గా ఉన్న ఈ 28 మంది గిరిజనులకు వారి భూమిని వారికి ఇప్పించాలని  డిమాండ్ చేస్తున్నామని అని అన్నారు.

 లేని ఎడల పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఈ గిరిజనులకు భూమి ఇచ్చేంతవరకు సిపిఎం పోరాటం ఆపదని హెచ్చరించారు.

 ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల కార్యదర్శి మచ్చ రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు శ్యామల వెంకట్ వ్యవసాయ కార్మిక సంఘం మండల సహాయ కార్యదర్శి బందెల చంటి, సిపిఎం పార్టీ  విజయకాలని  శాఖ కార్యదర్శి వరదల వరలక్ష్మి పలక సూరమ్మ డబ్బులు నాగమణి గొల్ల వీరబాబు షారోని, వీరమ్మ జ్యోతి  తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: