CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పెరిగిన పెట్రోల్,డీజల్ ధరలను తగ్గించాలి

Share it:

 


*ములుగు జిల్లా కేంద్రములో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి ఆధ్వర్యములో  ఎడ్ల బండ్ల తో సైకిల్ లతో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.

*ముఖ్య అతిథులుగా పాల్గొన్నా ర్యాలీ ఇంఛార్జి లు మెట్టు సాయి కుమార్,బక్క జడ్సన్.

*మన్యం టీవీ ఏటూరు నాగారం*

 ములుగు జిల్లా కేంద్రములో సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి ఆధ్వర్యములో ఎడ్ల బండ్ల తో సైకిల్ లతో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్,మరియు ఫిషర్ మెన్ రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయి కుమార్ లు ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కెసిఆర్.. అక్కడ మోడీ ఇక్కడ కేడి.. ఇద్దరు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.   గత 13 నెలలుగా వరసగా పెట్రోల్ ,డిజిల్‌ ధరలను పెంచుతూ మూలిగే నక్కపైన తాటిపండు పడ్డ చందంగా బిజెపి ప్రభుత్వం వ్యాపార దృక్పదంతో వ్యవహరించడం వలన ప్రజలను మరింత తీవ్రంగా కుంగదీస్తుందన్నారు. కరోనాతో లాక్‌డౌన్ల ఫలితంగా ప్రపంచమంతా ఆర్థికంగా కుంగిపోయిందని,ప్రపంచంలో అధికజనాభా ఉన్న మన దేశంలో లాక్‌డౌన్లతో పేద, మధ్య తరగతి, ఉద్యోగ,వ్యాపార,రైతు,చిల్లర వర్తకులు తీవ్రంగా నష్టపోయారని దుయ్యబట్టారు.  గత నెల రోజుల్లో ప్రభుత్వం 18 సార్లు పెట్రోలు,డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం అమానుషమన్నారు. పెంచిన ధ‌ర‌ల ప్ర‌భావం నిత్యావసర సరుకులపై ప‌డింద‌న్నారు. రాష్ట్రంలో లీటర్ పెట్రోలు ధ‌ర రూ.104 దాటింద‌న్నారు.  ఇప్ప‌టికైనా కేంద్ర ప్ర‌భుత్వం స్పందించి పెంచిన పెట్రోల్ ధ‌ర‌ల‌ను వెంట‌నే త‌గ్గించాల‌న్నారు.కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలపై కక్షతో భారాలు మోపుతోందని, ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను కాపాడాల్సింది పోయి వారిపై అధిక భారాలు మోపుతూ కార్పొరేట్లకు వరాలు కురిపించేందుకు ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు.మోడీ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ప్రజలంతా పోరాడాలని పిలుపునిచ్చారు.పెంచిన పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని,లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,

మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండీ ఆయు్బ్ ఖాన్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవిచందర్,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాగ్ వాన్ రెడ్డి, వివిధ మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,చెన్నోజు సూర్యనారాయణ,మైల జయరాంరెడ్డి,ఎండీ అప్సర్ పాషా,చిటమట రఘు, జాలాపు అనంత రెడ్డి,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,సీతారాం నాయక్

సహకార చైర్మన్ బొక్క సత్తి రెడ్డి,పులి సంపత్ గౌడ్,జిల్లా నాయకులు అనుబంధ సంఘాల,మండల అధ్యక్షులు సర్పంచులు ఉప సర్పంచ్లు,ఎంపీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధిలు యువజన కాంగ్రెస్ నాయకులు మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: