CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉హత్య కేసులో నిందితులు అరెస్ట్ - టూ టౌన్ సీఐ సత్యనారాయణ వెల్లడి...

Share it:


మన్యం టీవీ కొత్తగూడెం, జూలై 16 :- శుక్రవారం నాడు ఉదయం సుమారు 9గంటల సమయంలో కొత్తగూడెం 2టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తన సిబ్బందితో నమ్మదగ్గ సమాచారం మేరకు చిట్టిరామవరంలో నివాసముండే వల్కి ఇంటికి వచ్చిన మర్డర్ కేసులో నిందితులైన ఏ3) మాధవి మరియు ఏ4) చిట్టెమ్మలను పట్టుకుని విచారించగా మాధవికి ప్రధాన నిందితుడు అయిన బాలనేరస్థుడితో అక్రమ సంభందం పెట్టుకుని భర్త మంగిలాల్ ను చంపుటకు పథకం వేసుకొని,సోదరి చిట్టెమ్మ మరియు బాలనేరస్తుడి స్నేహితుడైన బానొత్ ప్రేమ్ కుమార్ ల సహాయంతో మంగీలాల్ ను హతమార్చడానికి పూనుకున్నారు.ఈ క్రమంలో తమ అక్రమ సంబందంనకు మంగిలాల్ అడ్డు వస్తున్నాడని అతనిని చంపితే తమకు అడ్డు తొలిగిపోతుందని అతని భార్య మాధవి సోదరి చిట్టెమ్మ మరియు ప్రధాన నిందితుడు అయిన బాలనేరస్థుడు,ప్రేమ్ కుమార్ లు జూలై 9న మాధవి బాలనేరస్థుడుకు ఫోన్ చేసి మంగిలాల్ ను మెడిసిన్కో సమని కొత్తగూడెం పంపిస్తాను.కొత్తగూడెం వచ్చిన మంగిలాల్ ను చంపి వేయమని బాలనేరస్థుడుకు చెప్పినది. ఆ తరువాత చిట్టెమ్మ కూడా బాలనేరస్థుడు కు ఫోన్ చేసి మంగిలాల్ ను చంపివేయమని చెప్పినది. ఆతరువాత బాలనేరస్థుడు మరియు ప్రేమ్ కుమార్ ఇద్దరు కలిసి TS 04 EJ 9181 అను నెంబర్ గల ద్విచక్ర వాహనాన్ని తీసుకొని కొత్తగూడెం బస్స్టాండ్ లో మంగిలాల్ గురించి ఎదురుచూసి మధ్యాహ్నం సమయం లో బస్ స్టాండ్ కు చేరుకున్న అతనిని అక్కడే బండిపై ఎక్కించుకొని ముందుగా వేసుకున్న పథకం ప్రకారం వెళుతూ రామవరంలో మద్యం బాటిల్ లను కొనుక్కొని గరిమెళ్ళపాడు అడవిలోకి తీసుకొని వెళ్ళి అక్కడ ముగ్గురు కలిసి మద్యం సేవించి, సాయంత్రం సుమారు 4గంటల సమయం లో ముందుగా వేసుకున్న పథకం ప్రకారం బీర్ బాటిల్ మరియు కర్రలతో మంగిలాల్ ను కొట్టి చంపి, ఎవరికి కనబడకుండా పొదలలో పడవేసి వెళ్ళి పోయినారు. ప్రధాన నిందితుడు అయిన బాలనేరస్థుడు మరియు ప్రేమ్ కుమార్,మాధవి, చిట్టెమ్మలు నలుగురు కలిసి ప్లాన్ ప్రకారం చంపినాము అని విచారణ లో అంగీకరిచినారు.నిన్న అరెస్ట్ కాబడిన బాలనేరస్థుడిని మరియు ప్రేమ్ కుమార్ లను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టునకు పంపడం జరిగింది.పరారీలో ఉన్న మాధవి మరియు చిట్టెమ్మలు నిన్న పట్టుబడిన నిందితులు వీరి పేర్లను పోలీసులకు చెప్పారో లేదో తెలుసుకొవడం కోసం చిట్టిరామవరంలోని వారి అమ్మమ్మ ఇంటికి రాగా వారిని పట్టుకుని ఈ రోజు అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టునకు పంపడం జరుగుతుంది.

Share it:

TELANGANA

Post A Comment: