CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరి చేయ్యలని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ డిమాండ్...

Share it:

 



👉తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా...



మన్యం టీవీ : జూలూరుపాడు, జూలై 16, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆద్వర్యంలో శుక్రవారం జూలూరుపాడు తాహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మండలోని పలు గ్రామాలకు చెందిన నిరుపేదలు తమకు ఇళ్లు మంజూరు చేయ్యలని నినదించారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్)న్యూ డెమోక్రసీ నాయకులు ఎదులాపురం గోపాల్ రావు మాట్లాడుతూ.. జూలూరుపాడు మండలంలో ఇళ్లు లేని నిరు పేదలు వెయ్యి మందికి పైగా ఉన్నారని,వారికి సొంత స్థలంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు మొక్కుబడిగా 300, ఇళ్ళను కొంతమందికి కేటాయించారని,రామచంద్రపురం, ఎలకలవొడ్డు, గ్రామాల డబుల్ బెడ్ రూం ఇళ్ళల్లో సరైన వసతులు లేవని, అన్నారు. నర్సాపురంలోని 80 ఇళ్లకు 56 మంది లబ్ధిదారులకు కేటాయించారని, మిగిలిన 24 డబుల్ బెడ్ రూం ఇళ్లలో అనర్హులు ఉంటున్నారని, వారిని తక్షణమే ఖాళీ చేయించి అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలని,డిమాండ్ చేశారు.

సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆర్ ఐ రవి కి అందజేశారు.ఈ కార్యక్రమంలో పద్మ,నాగమ్మ,కమలమ్మ,రజిని,లలిత,వెంకన్న,రాద, రాంబాబు,రవీందర్,గలిగే వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

👉పడమట నర్సాపురం డబుల్ బెడ్ రూం ఇండ్ల లో 24 మంది అనర్హులు ఆక్రమించుకొని ఉంటున్నారంటూ, పదే, పదే, వార్తలు వస్తున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్ కట్రం మోహన్ రావు ను మన్యం టీవీ వివరణ కోరగా.. గ్రామంలోని అర్హులైన నిరుపేద కుటుంబాలను గ్రామ సభ ద్వారా ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. ఎంపికైన లబ్ధిదారులను గ్రామ సభ ద్వారా అధికారుల సమక్షంలో లాటరీ పద్ధతిలో ఇండ్లను కేటాయించడం జరిగిందన్నారు. అక్రమంగా ఎవరూ లేరని, లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులే ఉంటున్నారని తెలిపారు. గ్రామంలో మంజూరి అయిన 80 ఇండ్లను అర్హులకే కేటాయించామని, తెలిపారు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం బురదజల్లే ప్రయత్నం, ప్రచారం, మాత్రమే నని అన్నారు.

Share it:

Post A Comment: