CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పామాయిల్ సాగు చేస్తున్న రైతులకు తప్పని కష్టాలు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఆగ్రహించిన రైతులు,ఫ్యాక్టరీ మెయిన్ గేట్ ముసివేసి ఆందోళనలు చేశారు.

Share it:

 




 మన్యం టీవీ,దమ్మపేట: మన తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజుల క్రితం జరిగిన క్యాబినెట్ సమావేశంలో 2022-23 ఏడాదికల్లా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టే దిశగా. రైతులను ప్రోత్సహిస్తూ, సబ్సిడీ అందించాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం అందరికీ విధితమే. అయినప్పటికీ ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు కష్టాలు తప్పవు. అనడానికి పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద, రాత్రి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే నిదర్శనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, అప్పారావుపేట గ్రామంలోని పామాయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యం. ఫ్యాక్టరీలోకి తెలంగాణ రైతులు సాగుచేసి పండించిన పామాయిల్ పంటను దిగుమతి చేసుకోకపోగా, సరిహద్దు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పామాయిల్ లోడుతో వచ్చిన వాహనాలను అనుమతిస్తూ, దిగుమతి చేసుకుంటూ. వారి ఇష్టారీతిన ప్రవర్తిస్తూ, తెలంగాణ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని.ఓపిక నశించి, ఆగ్రహించిన పామాయిల్ సాగుచేస్తున్న రైతులు, ఫ్యాక్టరీ మెయిన్ గేట్లు మూసివేసి ఆందోళనలు చేపట్టారు. రైతులు మాట్లాడుతూ ఈ విధంగా పామాయిల్ పంటను దిగుమతి చేసుకోకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తే, రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తీర్ణం ఎలా పెరుగుతుందని. తాము పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతుల పక్షాన నిలబడి.పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: