CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు సాగుదారుల భూమి సమస్య పరిస్కరించాలి

Share it:

 


మన్యం మనుగడ, గుండాల:

కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లయినా పోడు సాగుదారులు భూమి సమస్య పరిష్కారానికి నోచుకోలేదు అని, అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు నీటిని ఏజెన్సీ ప్రాంతాలకు వర్తింప చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి  ఆవునూరి మధు డిమాండ్ చేశారు. ఈరోజు గుండాల మండల కేంద్రానికి నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి హాజరైన పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్, రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....

ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ,గిరిజనులు ఇతర పేద ప్రజలు 40 ఏళ్లుగా పోడు కొట్టుకొని భూమిని సాగు చేస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివాసీలు సాగు చేసుకునే భూములకు గత పాలకుల హయాంలో హక్కు పత్రాలు సైతం లభించాయి. కానీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫారెస్ట్ అధికారులకు పూర్తి అధికారాలు కల్పించి గిరిజనులను భూమి నుండి వెళ్ళకొట్టే ప్రక్రియను చేపట్టారు. హరితహారం ముసుగులో పేద రైతుల వద్ద నుండి వేల ఎకరాల భూములను గుంజుకుని మొక్కలు చేపట్టారు. హక్కు పత్రాలను కలిగిన భూములను సైతం గుంజుకొని మొక్కలు పెడుతున్నారు. నిర్వాసితులు గా ఉన్న రైతులకు బతుకు తెరువు లేకుండా పోయింది. ఫారెస్ట్ అధికారులు తిరిగి వారి పైనే దాడులు చేస్తూ కేసులు పెడుతున్నారు. భూముల ఆక్రమణను నిలుపుదల చేసి పోడు భూములకు పట్టాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము.

ముఖ్యమంత్రి కెసిఆర్ గారు రోళ్ళపాడు చెరువు వద్ద సభ జరిపి దినిని రిజర్వాయర్ గా చేస్తామని ప్రకటించారు. 14 వేల కోట్ల రూపాయలు ఈ రిజర్వాయర్ కు కేటాయించినప్పటికీ దీని పని ప్రారంభించలేదు. దీనిమూలంగా వ్యవసాయ రంగం దెబ్బతింటుంది. సీతారామ ప్రాజెక్టు  ఈ జిల్లాలో ప్రారంభమైనప్పటికీ పినపాక ,ఇల్లందు నియోజక వర్గాలకు దీని నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. కావున తక్షణమే రాళ్లపాడు ప్రాజెక్టు రిజర్వాయర్ గా మార్చి ఇల్లెందు పరిసర ప్రాంతంలో గల ఏజెన్సీ వాసులకు, అదేవిధంగా గా పినపాక నియోజకవర్గం లోని మణుగూరు,పినపాక,కరకగూడెం ప్రాంతాలకు సీతారామ ప్రాజెక్టు నీళ్లను వచ్చే విధంగా చర్యలు చేపట్టాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ సహాయ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల సర్పంచ్ కోరం సీతారాములు, పర్శక రవి, యాసారపు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: