CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పిడుగుపాటుకు బలైన ఆదివాసి బాలిక

Share it:

 



సంవత్సరం క్రితమే మరణించిన తండ్రి


ఆలనా పాలనా చూస్తున్న అమ్మమ్మ తాతయ్య


దురదృష్టవశాత్తు కానరాని లోకాలకు


మన్యం మనుగడ, పినపాక: 


ముక్కుపచ్చలారని పసితనం పిడుగుపాటుకు బలైంది. అమ్మ నాన్న దూరమై అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంటూ, కాలాన్ని నడిపిస్తున్న పసిప్రాయం అసువులు బాసింది. బుధవారం నాడు పినపాక మండలంలో ఓ మోస్తారు వర్షం పడింది. అదే సమయంలో పెద్ద శబ్దంతో కూడిన పిడుగు పడటం జరిగింది. ఎక్కడో పడింది లే అనుకున్నారు జనమంత. కానీ ఆ పిడుగు ఓ పసి మొగ్గ

ప్రాణం తీస్తుందని ఎవరూ అనుకోలేదు. అదే సమయంలో పినపాక మండలం లోని బోటి గూడెం పంచాయతీకి చెందిన ఆదివాసీ గ్రామం విప్పల గుంపు కు చెందిన మడవి మాసమ్మ ( 9 సంవత్సరాలు) తన స్నేహితులతో కలిసి గ్రామానికి సమీపాన ఆటలాడుతూ ఉండగా, అప్పటికే చిరు జల్లులతో కూడిన వర్షం ప్రారంభమైంది. అదే సమయంలో భయంకరమైన శబ్దం తో కూడిన పిడుగు మాసమ్మ పై పడడంతో తలనుండి కాలి భాగం వరకు ఎడమవైపు కాలిపోయింది. అదే సమయంలో ఆ బాలిక విగతజీవిగా మారిపోయింది. అది గమనించిన స్నేహితులు భయంతో ఇంటి వైపు పరుగులు తీశారు. ఈ శబ్దాన్ని విన్న బోటిగూడెం పంచాయతీ సిబ్బంది అయిన భాను అక్కడికి చేరుకుని చూడగా బాలిక విగతజీవిగా మారిపోయింది అని "మన్యం మనుగడ"కు తెలిపాడు. విషయం తెలుసుకున్న బాలిక తాతయ్య - అమ్మమ్మ మడకం పెద్ద లింగయ్య- సుబ్బమ్మ తమ మనవరాలి మృతి పట్ల లబోదిబోమని ఏడవడం ప్రారంభించారు. అమ్మమ్మ అయిన సుబ్బమ్మ వికలాంగురాలు అయి ఉండి, ఎదుగుతున్న మనవరాలు చేదోడువాదోడుగా ఉంటుందని అనుకుంటున్న సమయంలో, మరణించడాన్ని చూసి భోరున విలపిస్తుంది.

Share it:

TELANGANA

Post A Comment: