CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నెరవేరనున్న ఏళ్ల నాటి కల

Share it:

 



రేగా కాంతారావు చొరవతో ఇనుప వంతెన నిర్మాణం


శంకుస్థాపన పనులు ప్రారంభించిన ఏడూళ్ల బయ్యారం సర్పంచ్‌ కోరం రజిని 


మన్యం మనుగడ, పినపాక : 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పరిధిలోని  ఏడూళ్లబయ్యారం గ్రామ పంచాయితీ పరిధిలో గల పోతురెడ్డిపల్లి కిందిగుంపుకు వానాకాలంలో వెళ్లాలంటే ఒక సవాలే. ఎన్నో ఏళ్ల నాటి నుండి ప్రభుత్వాలు ఎన్ని మారినా, పోతిరెడ్డిపల్లి గ్రామాన్ని, కింది గుంపును వేరు చేస్తున్న కాలువ కారణంగా కింది గుంపు ప్రజలు నానా ఇబ్బందులు పడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలువను దాటి వెళ్లాల్సి వచ్చేది. అలాంటి కింది గుంపుకు ఏడూళ్ల బయ్యారం సర్పంచ్ కోరం రజిని ఆధ్వర్యంలో ఇనుప వంతెనను నిర్మించేందుకు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం పట్ల పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీలు, కింది గింపు ప్రాంతానికి చెందిన ఆదివాసులు వారి హర్షాన్ని వ్యక్తపరిచారు. ఎన్నో ఏళ్ళ నాటి కల, నేడు నెరవేరుతున్నందుకు సర్పంచ్ కోరం రజనీ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా 

సర్పంచ్‌ కోరం రజిని మాట్లాడుతూ,గత కొన్ని సంవత్సరాలుగా కిందిగుంపుకు రవాణా సౌకర్యం సరిగ్గా లేక గిరిజనులు తీవ్ర  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వరదల సమయంలో ఆ గ్రామాన్ని వరద నీరు చుట్టూ చేరుతుందని, కిందిగుంపులో ఉన్న ప్రజలు భయాందోళనలో ఉంటున్నారన్నారు. తెలంగాణా ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు  ఆదేశాల మేరకు గ్రామ పంచాయితీ నిధుల నుండి సుమారు రూ.4 లక్షలతో ప్రత్యేకంగా తాత్కాలికంగా ఇనుప వంతెన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు సర్పంచ్‌ తెలిపారు. 

కేవలం వారం రోజులలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. కిందిగుంపు ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం అవుతుందని సర్పంచ్‌ కోరం రజిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడూళ్ల బయ్యారం ఉప సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, పోతిరెడ్డి పల్లి గ్రామ ప్రజానీకం పాల్గొన్నారు.

Share it:

Post A Comment: