CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

లోతట్టు ప్రాంతాల ప్రజల అప్రమత్తంగా ఉండాలి

Share it:

 


మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

మన్యం టీవీ ఏటూరు నాగారం

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో గత రెండు రోజులనుండి కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలోని వాగులు,ముంపు గ్రామాలను సందర్శన లో బాగంగా జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య   ఏటూరు నాగారం గోదావరి ముల్లకట్ట బ్రిడ్జ్ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ పరిశీలన లో ఐటిడిఏ పి ఓ హన్మంతు కె జెండగే,అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి తదితరులుపాల్గొన్నారు.

రాష్ట్రం లో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వలన జిల్లాలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందు జాగ్రత్త చర్యల నిమిత్తం అధికార యంత్రాంగానికి ముందుగానే ఎమర్జెన్సీ గా విధులు కేటాయించి అప్రమత్తం చేయ నైనదని కలెక్టర్ అన్నారు. జిల్లాలో  కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి మూడు సిఫ్ట్ లు గా సిబ్బందికి విధులు కేటాయించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. టోల్ ఫ్రీ నెంబర్  1008-4250 -520 ఏర్పాటు చేయడం జరిగిందని వారు అన్నారు. రెవెన్యూ అధికారులు, తాసిల్దార్ లు,మరియు సంబంధిత అధికారులు 24 గంటలు అందుబాటులో ఉంటారని వారు అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా అల్ప పీడన ప్రభావం వలన ముంపు ప్రాంతాలైన 

ఏటూరు నాగరం లోని రామన్నగూడెం,మంగపేట లోని పుష్కర ఘాట్ ను పరిశీలన కు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్,ములుగు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కుసుమ జగదీష్,జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తో కలిసి పరిశీలించారు.లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసే విధంగా జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగాన్ని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసి అప్రమత్తం చేశారు.అనంతర ఏటూరు నాగారం మీటింగ్ హాలులో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్ష లో బాగంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి ఇంకా మొదటి ప్రమాద ఘటిక రావడానికి  ఇంకా 16 క్యూసెక్కుల వాటర్ వచ్చినట్లు అయితే మొదటి ప్రమాద సూచిక వస్తుందని మంత్రి అన్నారు.రామప్ప కి ప్రపంచ స్థాయి  గుర్తింపు పొందాలని వారు అన్నారు.విద్యుత్ సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఏవైనా ప్రమాదం కలిగించే విధంగా ఉంటే వెంటనే మార్చాలి.చెరువులు, కుంటలు,వాగులు ఎక్కడైనా తెగిపోయే విధంగా ఉంటే వెంటనే వాటి మరమ్మత్తులు చేయాలి అని మంత్రి  అన్నారు.

రామప్ప నుంచి పాకాల వరకు వేరే చెరువులు నింపుకునే అవకాశం ఉంటే వాటిని పనులు చేపట్టండి.ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురండి అనివారు అన్నారు.ప్రమాదాలు జరిగే చోట హెచ్చరికల బోర్డులు పెట్టాలి. ప్రమాదాలు నివారించాలి అని,వరుస వర్షాల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు అన్నారు. అంటువ్యాధులు రాకుండా సిబ్బంది అందుబాటులో ఉండాలని,మారుమూల ప్రాంతం సరైన రవాణా వసతి లేని ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ఒక కుటుంబం వలె పని చేయాలని మంత్రి అన్నారు.మేడారంలో శాశ్వతంగా భక్తులకు సౌకర్యం కల్పించే విధంగా పనులు చేయాల్సి ఉంది. సీఎం కేసిఆర్  నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే మేడారానికి గొప్ప పేరు వచ్చింది. మెరుగైన వసతులు వచ్చాయి.

అమ్మవార్ల జాతర అయిన తర్వాతే కరోనా వచ్చింది. ఈసారి అమ్మవారి జాతర వస్తున్నందున కరోనా రాకుండా చూడాలని కోరుకుంటున్నాను అని మంత్రి అన్నారు. ముంపు ప్రాంతాలు ఉన్న గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రతి గ్రామానికి ఒక అధికారిని పెట్టీ జాగ్రత్తలు తీసుకొని నిత్యం పర్యవేక్షణ చేయాలి.ఈ విపత్తు నుంచి క్షేమంగా బయట పడేలా సమర్థవంతంగా పని చేయాలని వారు అన్నారు.

జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ ముందస్తు ప్రణాళిక ప్రకారం సమస్యాత్మంగా ప్రాంతాలను గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలలో ప్రజల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉన్నచోట ఇసుక బస్తాలను అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం లో ఏర్పడిన ప్రమాద గటికలను దృష్టిలో ఉంచుకుని   ఆ ప్రదేశాల్లో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. చెరువు తూముల వద్ద  ఇసుక బస్తాలను అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం లో ఏర్పడిన ప్రమాద గటికలను దృష్టిలో ఉంచుకుని   ఆ ప్రదేశాల్లో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.

సమావేశానికి ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పి సంగ్రామ్ సింగ్ జి పాటిల్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి హన్మంతు కె జెండగే, అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, ఏటూరు నాగారం ఏఎస్పీ గౌస్ ఆలం, చీఫ్ ఇంజినీర్ విజయ్ భాస్కర్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: