CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సెయింట్ జోసఫ్ పాఠశాల పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు.?

Share it:


ఎంపీపీ బానోత్ పార్వతి.


చండ్రుగొండ మన్యం టీవీ  ప్రతినిధి:


ఆ పాఠశాల పై నిత్యం ఆరోపణలు వస్తున్న కూడా పాఠశాలలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు భానోత్ పార్వతి విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  సెయింట్ జోసఫ్ పాఠశాల పై నిత్యం ఆరోపణలు వస్తున్నాయని తల్లిదండ్రులే పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ మండల విద్యాశాఖ అధికారి కి దరఖాస్తు కూడా చేసారని అలాగే పాఠశాలలో పాఠ్యపుస్తకాల అమ్ముతున్నారని వచ్చిన కథనాలకు  మండల విద్యాశాఖ అధికారి వెళ్లి తనిఖీలు నిర్వహించి పుస్తకాలను అమ్ముతున్నట్లు ఒప్పుకున్న అధికారి. దానిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పాఠశాల యాజమాన్యం కూడా తాము కేవలం ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తున్నామని చెబుతున్నారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు చెల్లించిన ఫీజులకు బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదంటూ  నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు పాఠశాల లో ఏ ఏ తరగతులకు ఎంత రుసుము చెల్లించాలి దానికి సంబంధించిన వివరాలను నోటీసు బోర్డులో అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలి అలాంటిది పాఠశాల యాజమాన్యం నోటీస్ బోర్డ్ లో సమాచారం ఎందుకు పెట్టలేదు. స్వయంగా విద్యాశాఖ అధికారే  పాఠశాలను తనిఖీ చేసి  పుస్తకాలు అమ్ముతున్నట్లు నిర్ధారించి. ఇప్పుడు పాఠశాల పై చర్యలు తీసుకునే అర్హత  తన చేతుల్లో లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని. మీ చేతుల్లో లేనప్పుడు జిల్లా ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదు. అసలు ఆ పాఠశాల విషయంలో ఏం జరుగుతుంది. పాఠశాల విషయంలో ఉన్నత అధికారులు అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదని ఇదే విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కి దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు.

Share it:

TELANGANA

Post A Comment: