CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సెయింట్ జోసఫ్ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి యస్ యఫ్ఐ డిమాండ్..

Share it:

 


- పాఠశాల ముందు నిరసన

- మండల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు


చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :


చండ్రుగొండ మండల కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రం లోని సెయింట్ జోసెఫ్ పాఠశాల ఎదురుగా ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఆందోళన నిర్వహించారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సెయింట్ జోసెఫ్ పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి అధిక ఫీజులతో పాటు పాఠశాలలోనే పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారని. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన వార్తాపత్రికలలో  నాలుగు రోజులుగా వరుస కథనాలు ప్రచారం అవుతున్న అధికారులు స్పందించకపోవడంతో  పలు అనుమానాలను వ్యక్తమవుతున్నాయని అన్నారు. సాక్షాత్తు మండల విద్యాశాఖ అధికారికి పాఠశాలలో పాఠ్యపుస్తకాలు పట్టుబడిన కూడా చర్యలు తీసుకోక పోగా అది నా పరిధిలో లేదని కేవలం జిల్లా అధికారులు చేతుల్లోనే ఉందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పాఠశాల యాజమాన్యం చేస్తున్న దోపిడీలో మండల విద్యాశాఖ అధికారులు పాత్ర కూడా ఉందని స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పాఠశాల గుర్తింపును రద్దు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో జిల్లాలో ఉన్న విద్యార్థి సంఘాలను ఏకం చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా నిరసన కార్యక్రమం తెలియజేస్తామని హెచ్చరించారు. ఇదే విషయంపై మండల విద్యాశాఖ అధికారిని తెలంగాణ కేసరి ప్రతినిధి వివరణ కోరగా.. పాఠశాల యాజమాన్యం ఒకరోజు గడువు అడిగి నాలుగు రోజులు అవుతున్న నేటికి కూడా బిల్లులకు సంబంధించిన వివరాలను తెలియజేయలేదని ఇదే విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేస్తామని తెలిపారు. అలాగే ఆ పాఠశాల పై చర్యలు తీసుకునే అర్హత తనకు లేదని కేవలం జిల్లా అధికారులకు మాత్రమే ఉందని ఇదే విషయాన్ని జిల్లా ఉన్నత అధికారులకు తెలియజేస్తానని.  చెప్పడంతో విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు పాఠశాల  యాజమాన్యం కు  ప్రభుత్వం అన్న ప్రభుత్వ ఆదేశాలన్న లెక్క లేదన్నట్లుగా వ్యవహరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని. పాఠశాల యాజమాన్యం మండల  విద్యాశాఖ అధికారులను సైతం లెక్క చేయక పోవడం వారి ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతున్నాయి.  ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు కలగజేసుకుని సెయింట్ జోసఫ్ పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు రద్దు చేసి పాఠశాల యాజమాన్యం పై కఠిన  చర్యలు తీసుకోవాలని. తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: