CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జంపన్నవాగులో వరద ఉధృతిలో కొట్టుకుపోయి మృతి చెందిన కొత్త కొండాపురం యువకులకు ఐ ఎఫ్ టి యు సంతాపం*

Share it:

 


      👉 మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి.. స్మశాన వాటిక కు భూమి కేటాయించాలని డిమాండ్

మన్యం మనుగడ,మణుగూరు:

        సోమవారం సాయంత్రం సమ్మక్క సారక్క జాతర సమీపంలో జంపన్నవాగులో ఆకస్మిక వరద ఉధృతికి కొట్టుకుపోయి మృతిచెందిన మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి నిర్వాసిత  కొత్త కొండాపురం గ్రామ యువకులు  ఉడుముడి కోటేశ్వరరావు (31) బంగారి శ్యామలరావు (25) ఇరువురి మృతి పట్ల స్థానిక ఐ.ఎఫ్.టి.యు నాయకులు నా సర్ పాషా, మంగీలాల్

 సంతాపం తెలిపారు, బుధవారం సాయంత్రం కొత్త కొండాపురం చేరుకున్న మృతుల భౌతిక కాయలను వారు సందర్శించి నివాళులర్పించారు, కాగా కోటేశ్వరరావు (తండ్రి చందర్రావు)వివాహితుడు కాగా ఆయనకు భార్య ఇద్దరు కుమారులు బంగారి శ్యామల రావు (తండ్రి సత్యం) అవివాహితుడు  సింగరేణి కాంట్రాక్టు కార్మికునీగా సివిల్ విభాగంలో పనిచేస్తున్నాడు, చిన్న వేడుకకని తాడువాయి వెళ్ళినవాళ్ళు  ప్రమాదవశాత్తు చనిపోవడం తో కొత్త కొండాపురంలో విషాదం అలుముకుంది, ఇరువురి కుటుంబాల రోదనలు మిన్నంటాయి,ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు  నాయకులు మాట్లాడుతూ ఇరువురి  కుటుంబాలు కూడా  నిరుపేద కుటుంబాలనీ వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు, అలాగే సింగరేణి నిర్వాసిత గ్రామాల కొత్తకొండాపురానికి కొత్త కొమ్ము గుడేనికి సమీపంలో ఎక్కడ హిందూ స్మశాన వాటిక లేదని జిల్లా కలెక్టర్ ఆ గ్రామాలకు సమీపంలో స్థలం చూపించమని ఆదేశాలు జారీ చేసిన ఇప్పటివరకు స్మశాన వాటికకు భూమి చూపించకపోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు, స్మశాన వాటికి లేకపోవడంతో   ఈ రెండు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు అన్నారు జిల్లా కలెక్టర్ స్పందించి స్మశాన వాటికకు భూమి కేటాయించాలని కోరారు, ఈ కార్యక్రమంలో

  ఏ మంగీలాల్ , కోడి రామకృష్ణ, మంగయ్య, సమ్మయ్య, కోటన్న, సీతారాములు, నరసింహారావు, శ్రీకాంత్ , నరేందర్, రాంబాబు, చంద్ర రావు, కాంతయ్య, రాము, అమ్ములమ్మ, భద్రమ్మ, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: