CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మావోయిస్టు నేత రావుల రంజిత్​ అలియాస్​ శ్రీకాంత్​ లొంగుబాటు

Share it:

 


మన్యం మనుగడ డెస్క్:

 మావోయిస్టు కార్యక్రమాలపై విరక్తి చెందిన రంజిత్​ ఇవాళ... డీజీపీ మహేందర్​రెడ్డి ఎదుట లొంగిపోయాడు. ప్రస్తుత కాలంలో మావోయిస్టు భావజాలంతో ఎలాంటి ఉపయోగం లేదని రంజిత్​ అభిప్రాయపడుతున్నట్టు డీజీపీ వెల్లడించారు.

మావోయిస్టు నేత, ప్లాటూన్‌ పార్టీ కమిటీ మెంబర్‌ రావుల రంజిత్​ అలియాశ్​ శ్రీకాంత్​.. డీజీపీ మహేందర్​రెడ్డి ఎదుట లొంగిపోయాడు. పాఠశాల వయసు నుంచే మావోయిస్టు కార్యక్రమాల్లో పాల్గొన్న రంజిత్‌.. 2019లో తండ్రి మరణించాక అనేక అవమానాలకు గురయ్యాడు. మావోయిస్టు కార్యక్రమాలపై రంజిత్‌ విరక్తి చెందాడు.


రామన్న కొడుకే ఈ రంజిత్​...

వరంగల్​ జిల్లా మద్దూర్​ మండలం బెక్కల్​కు చెందిన మవోయిస్ట్​ రావుల శ్రీనివాస్​ అలియాన్​ రామన్న కుమారుడే రంజిత్​. 1982 సమయంలో జరిగిన పీపుల్స్​ వార్​లోనే రామన్న పాల్గొన్నాడు. అప్పటి నుంచి భద్రాచలం దళంలో ఉంటూ... సెంట్రల్​ కమిటీ మెంబర్​గా, డీకేఎస్​జెడ్​సీ సెక్రటరీగా ఎదిగాడు. , మాధవి అలియాస్​ సామిత్రి అలియాస్​ సుశీలకు 1988లో రంజిత్​ జన్మించాడు. రంజిత్​ బాల్యమంతా... మవోయిస్టుల కార్యక్రమాల్లో భాగస్వామ్యుడయ్యాడు. ఆరో తరగతి వరకు జన్​ధన్​ సర్కారు పాఠశాలలో చదువు సాగించాడు. ఆ తర్వాత సీక్రెట్​గా నగేశ్​ అనే మావోయిస్టు సాయంతో నిజామాబాద్​లోని కాకతీయ పాఠశాలలో పది వరకు చదివాడు. 2015లో పదో తరగతి పూర్తయ్యాక... మవోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు. అదే ఏడాది జరిగిన కాల్పుల్లో నగేశ్​ చనిపోవటం వల్ల... రంజిత్​ బయటికి వెళ్తే సమస్య అవుతుందని తండ్రి రామన్న పైచదువులకు పంపించలేదు.

మావోయిస్టు కార్యకలాపాలపై విరక్తి...

2015 నుంచి 2017 వరకు తండ్రి ఆధ్వర్యంలోనే రంజిత్​ పలు కీలక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాడు. 2017లో రామన్న సలహా మేరకు రంజిత్​... బెటాలియన్​లో చేరాడు. సెంకండ్ ప్లాటూన్‌ మెంబర్​గా చేరి... 2019 వరకు పదోన్నతి మీద ప్లాటూన్​ పార్టీ కమిటీ మెంబర్​గా ఎదిగాడు. 2019లో రామన్నకు రెండు సార్లు గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో మెరుగైన చికిత్స కోసం బయటికి వెళ్దామని రంజిత్​ చెప్పినప్పుడు రామన్న ఒప్పుకోలేదు. సరైన వైద్యం అందక... పరిస్థితి విషమించి రామన్న చనిపోయాడు. తండ్రి చనిపోయినప్పటి నుంచి రంజిత్​కు దళంలో అనేక అవమానాలు ఎదురయ్యాయి. అప్పటి నుంచి రంజిత్​కు మావోయిస్టు కార్యకలాపాలపై విరక్తి వచ్చింది. తాను బయటికి వెళ్తానని కమిటీ సభ్యులను అనుమతి కోరగా... నిరాకరించారు. అప్పటి నుంచి జూన్​ వరకు తన తల్లి సుశీల ఆధ్వర్యంలోనే పనిచేశాడు.

పెద్దగా ఉపయోగం లేదని...

ఉన్నతస్థాయి కేడర్​ నేతల కుమారునిగా.. చిన్నప్పటి నుంచి మావోయిస్టు కార్యకలపాల్లో పనిచేస్తున్న రంజిత్​... సమాజంలో వచ్చిన మార్పులను గమనించాడు. మారుతున్న సమాజానికి మావోయిస్టు కార్యకలాపాలతో పెద్దగా ఉపయోగం లేదని భావించాడు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు... ప్రజా సంక్షేమం దిశగానే ఉండటం వల్ల ప్రజాస్వామ్యం విధానాలపై కొత్తగా మావోయిస్టులు చేయాల్సిన పని ఏమీ లేదన్న అభిప్రాయానికి వచ్చాడు.

నాలుగు కీలక దాడుల్లో...

దండకారణ్యంలో జరిగిన నాలుగు కీలక దాడుల్లో రంజిత్​ పాల్గొన్నాడు. 2018లో 9 మందిని హతమార్చిన కాసారం దాడిలో పాల్గొన్నాడు. 2020లో జరిగిన ఎర్రం దాడిలోనూ పాల్గొన్నాడు. 2020లో 23 మంది పోలీసులను హతమార్చిన మినప దాడిలోనూ రంజిత్​ ఉన్నాడు. 2021లో 26 మంది పోలీసులు చనిపోయిన జీరం దాడిలోనూ రంజిత్​ పాల్గొన్నాడు.

పునరావాసం కల్పిస్తాం...

"కరోనా సోకిన మావోయిస్టులు లొంగిపోతే వాళ్లకు ప్రభుత్వం మంచి వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉంది. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తాం. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీలో 25మంది ఉండగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లే 14మంది ఉన్నారు. వాళ్లు లొంగిపోతే తగిన పునరావాసం కల్పిస్తాం." - మహేందర్ రెడ్డి, డీజీపీ

Share it:

TELANGANA

Post A Comment: