CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మన్యం మనుగడ కథనానికి స్పందించిన పశుసంవర్ధక శాఖ అధికారులు🔥

Share it:

 


 👉దామర తోగు గ్రామంలో పశు వైద్య శిబిరం నిర్వహించిన పశుసంవర్ధక శాఖ సిబ్బంది.✍️గడ్డం వీరన్న, మన్యం మనుగడ ప్రతినిధి

 గుండాల జూలై 14 (మన్యం మనుగడ) మన్యం మనుగడ కథనానికి కథనానికి స్పందించిన పశుసంవర్ధక శాఖ  అధికారులు రెండు రోజుల  క్రితం మన్యం మనుగడలో వింత వ్యాధితో పశువులు మృతి అని కథనం రావడంతో తక్షణమే స్పందించిన పశుసంవర్ధక శాఖ అధికారులు బుధవారం  దామర తోగు గ్రామంలో పశు వైద్య శిబిరాన్ని  నిర్వహించారు. జబ్బుతో బాధ పడుతున్న పశువులకు టీకాలు వేయడం జరిగిందన్నారు. వాటితో పాటు మిగిలిన 246 పశువులకు దొబ్బ వాపు, గొంతువాపు రాకుండా ఉండేందుకు ఈ కలను వేశామని  పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. ఇకనుండి పశువులకు ఎటువంటి జబ్బుల బారిన పడకుండా వైద్య శిబిరాలను నిర్వహిస్తామన్నారు. ఈ  కార్యక్రమంలో దామర తోగు సర్పంచ్ సుతారి సరోజన, వెటర్నరీ అసిస్టెంట్ హరి కిరణ్ ,మరియు సిబ్బంది  గ్రామస్తులు సుతారి సత్యం, తదితరులు పాల్గొన్నారు.

Share it:

SLIDER

TELANGANA

Post A Comment: