CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సంక్షేమ పథకాలు చేపట్టడంల‍ో కెసిఆర్ కి మించిన సీఎం దేశంలోనే లేరు. --- ఎం.ఎల్.ఏ వనమా.

Share it:

 


మన్యం టీవీ పాల్వంచ:-

ప్రజా సంక్షేమం, తెలంగాణ రాష్ర్టాన్ని   అభివృద్ధి పరచడంలో   దేశంలో కెసిఆర్ కి మించిన సీఎం ఎవ్వరూ లేరని కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం పాల్వంచ మండల పరిధిలోని జగన్నాథపురం రైతు వేదిక వద్ద  171 మంది లబ్ధిదారులకు పాల్వంచ పాత ఆర్డీవో కార్యాలయం వద్ద  383మంది లబ్ధిదారులకు *వనమా* కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ రేషన్ కార్డులపై ఆగస్టు నెల నుండి రేషన్ సరుకులు ఇస్తారన్నారు. రేషన్ కార్డులు రాని వారు ఎవ్వరూ అధైర్యపడవద్దని లబ్ధిదారులందరికీ దశలవారీగా కార్డులు  ఇచ్చేలా చర్యలు చేపడతామన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని లబ్ధిదారులకే నేరుగా పథకాలు అందిస్తామన్నారు.  నియోజకవర్గ ప్రజలే   తనకు దేవుళ్లని వారి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధం అన్నారు. దశలవారీగా ఎన్నికల వాగ్దానాలు నెరవేరుస్తామన్నారు.

ప్రతి ఇంటికి పెద్ద కొడుకు *కెసిఆర్* అని సంక్షేమ పథకాలు చేపట్టడంతో ఆయన  కెవరుా సరికారన్నారు. పట్టణ ప్రగతి, పల్లెప్రగతి దేశానికే ఆదర్శమని అన్నారు. త్వరలోనే 57 సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్  ఇవ్వనున్నట్లు తెలిపారు. దళిత బందు పథకం కింద దళితులకు న్యాయం చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్రరావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, తహశీల్దార్ సీహెచ్ స్వామి, డీటీ శివకుమార్, జెడ్పీటీసీ సభ్యులు బరపాటి వాసుదేవరావు, సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్, డైరక్టర్లు కనగాల నారాయణ రావు,   ఆత్మకమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, డైరక్టర్ కాల్వ ప్రకాశ్ రావు,మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, డైరెక్టర్ రమేష్, సర్పంచ్ అనిత,,వైస్ ఎంపీపీ మార్గం గురవయ్య, ఎంపీటీసీలు మూడ్ ఉషారాణి, ముద్దుల మోహన్ రావు, పలువురు సర్పంచులు ఎంపీటీసీలు టీఆర్ఎస్ నాయకులు మహీపతి రామలింగం, మల్లెల శ్రీరామ్మూర్తి, మంతపురి రాజుగౌడ్, SVRK ఆచార్యులు, దాసరి నాగేశ్వరరావు, బేతంశెట్టి విజయ్, బండి చిన్నవెంకటేశ్వర్లు, కందుకూరి రాము, చిరంజీవి, హర్షవర్ధన్, పెండ్యాల కృష్ణమూర్తి, సంతోష్ రెడ్డి (బబ్లూ), నారేకట్ల రాజశేఖర్,రవిగౌడ్, కొండం పుల్లయ్య, నందనాయక్,  బండపల్లి వెంకటనారాయణ, షణ్ముఖ చారి,బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: