CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అన్ని నేనై అండగా ఉంటా...

Share it:

 


🔥 కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఎక్కడలేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రం లో

🔥 ఆదిలాబాద్ నుండి అశ్వారావుపేట దాకా అభివృద్ధిలో దూసుకుపోతున్న ఏజెన్సీ

🔥 నిరుపేదలకు వరం రేషన్ కార్డు

🔥విప్ రేగా కాంతారావు

 గుండాల జూలై 27 (మన్యం మనుగడ) అన్నీ నేనే అండగా ఉంటానని పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లేక కాంతారావు అన్నారు సోమవారం గుండాల ఆళ్ల పల్లి మండలాల్లో ఆయన పర్యటించి రేషన్ కార్డులను పంపిణీ చేశారు. పేదలకు ఇది ఒక వరం అని రేషన్ కార్డు ద్వారా అనేక సంక్షేమ పథకాలు ముడిపడి ఉన్నందున పేదలకు ఇదొక గొప్ప వరంగా భావించాలని ఆయన అన్నారు. రెండు మండలాలు నాకు వేరు వేరు కాదని రెండు మండలాలను సమానంగా ప్రేమిస్తానని అభివృద్ధిలో రెండు మండలాలను అగ్రగామిగా నిలుపుదాం అన్నారు. మారుమూల మండలాలు అభివృద్ధిలో కొంత వెనుకబడ్డ ముందు ముందు దూసుకుపోయే విధంగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. ఇప్పటికే ప్రధాన వాగుల పై వంతెనలను పూర్తి చేయించామని ప్రతి పల్లెకు రహదారి సౌకర్యం కల్పించామన్నారు. మిగిలిన పల్లెలు ఏమైనా ఉంటే త్వరలోనే వాటిని కూడా మంజూరు చేయించి పూర్తి చేయిస్తాను అన్నారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుంది అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి పల్లెలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారని ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు.

Share it:

Post A Comment: