CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణా సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం - ప్రజా సంక్షేమ పథకాలతో రికార్డులు స్పష్టిస్తున్న సి.ఎం కె.సి.ఆర్.

Share it:

 


మన్యం టీవీ పాల్వంచ :-

తెలంగాణా రాష్ట్రంలో అనేక ప్రజాసంక్షేమ పథకాల తో రికార్డులు సృష్టిస్తున్న *సి.ఎం కెసిఆర్* దేశానికి ఆదర్శం అని *కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు* అన్నారు. పాల్వంచలో సోమవారం స్థానిక పాత రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో పాల్వంచ పట్టణానికి చెందిన 384 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను *వనమా* పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా *కెసిఆర్* ఉండటం గర్వకారణం అన్నారు. *కేసీఆర్* పేదల పక్షపాతి అని, ప్రజల బాధలు, కష్టాలు తెలిసిన వాడు అన్నారు. ప్రజల ఆకాంక్షల కు అనుగుణంగా *కెసిఆర్* పాలన సాగిస్తున్నారన్నారు. దేశానికి ఆదర్శవంతమైన పథకాలు *కేసీఆర్* అమలు చేసిన విధంగా, ఏ ఇతర ముఖ్యమంత్రులు చేయలేకపోతున్నారన్నారు. ప్రజలు కోరుకున్న విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన చేస్తుందన్నారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకంజ వేసేది లేదని, ఇచ్చిన వాగ్దానాలను దాశలవారీగా అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.


ఈ కార్యక్రమంలో *తహసీల్దార్ స్వామి, తెరాస రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్ర రావు,డీసీఎంస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్,ఎం. పి. డి. ఓ రవీంద్ర ప్రసాద్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ పురందర్, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, రైతు సమన్వయ సమితి కన్వీనర్ కిలారు నాగేశ్వరరావు, సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, డైరెక్టర్ కనగాల నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, వైస్ ఎంపీపీ మార్గం గురవయ్య,ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, డైరెక్టర్ కాల్వ ప్రకాష్ రావు, తెరాస పట్టణ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ యస్.వి.ఆర్క్ ఆచార్యులు, మండల అధ్యక్షులు మల్లెల శ్రీరామ్మూర్తి,పూసల విశ్వనాధం, నాయకులు మహిపతి రామలింగం, యర్రంశెట్టి ముత్తయ్య, కాల్వ భాస్కర్,దాసరి నాగేశ్వరరావు, బేతంశెట్టి విజయ్, బండి చిన్న వెంకటేశ్వర్లు, చింతా నాగరాజు, హర్షవర్ధన్, రవి గౌడ్ పెండ్యాల కృష్ణమూర్తి, సందు ప్రభాకర్, కూర చంద్రం, నెమలిపురి రాజేష్, కె. వాసు, రమేష్ రాఠి* తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: