సిలిండర్లు అందజేత
మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండలం లోని జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జానంపేట ఉపసర్పంచ్ రాయల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆక్సిజన్ సిలిండర్ ను అందజేయడం జరిగింది. ఉప సర్పంచ్ రాయల సత్యనారాయణ కుమారులైనరాయల రాజేష్ రాయల నవీన్ లు ఆక్సిజన్ సిలిండర్ ను వితరణగా ఇవ్వగా, తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు శృతి చేతికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, జానంపేట సర్పంచ్ మహేష్, టిఆర్ఎస్ నాయకులు దాట్ల వాసు బాబు, సత్తిబాబు తదితరులు పాల్గొనడం జరిగింది
Post A Comment: