CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతు వ్యతిరేక విధానాలపై నిరసనగా రైతు సంఘం నాయకులు ప్రతిజ్ఞ కార్యక్రమం

Share it:

 




 మన్యంటీవీ, దమ్మపేట:

గత సంవత్సరం టమాటా, ఉల్లిగడ్డ రైతులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో లో మంద సౌర్ పట్టణంలో టమాటా, ఉల్లిగడ్డ లకు గిట్టుబాటు ధర కల్పించాలని శాంతియుతంగా పోరాటం చేస్తుంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం పోలీసుల చేత కాల్పులు జరిపి ఆరుగురు ప్రాణాలను బలిగొన్న దానికి నిరసనగా మరియు గత ఏడు నెలలుగా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని సుమారు 450 మంది రైతులు చనిపోయిన దానికి నిరసనగా ఈరోజు దమ్మపేట సిపిఐ కార్యాలయం వద్ద రైతు సంఘం నాయకులు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు, సిపిఐ ఎమ్ఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు అమర్లపూడి రాము, తెలుగు దేశం రైతు సంఘం నాయకులు గడ్డిపాటి సత్యం, సిపిఐ రైతు సంఘం నాయకులు కౌలూరు మోహన రావు మాట్లాడుతూ ఈ దేశానికి అన్నం పెట్టే రైతు కి ఎన్నో అవమానాలు ప్రభుత్వ కాల్పులు ప్రభుత్వం జైలుకు పంపించడం రైతులను చిన్నచూపు చూడటం రైతుల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వాలు పరిష్కరించకపోవడం చాలా బాధాకరమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావి రైతు ప్రభుత్వాలని రైతుల కోసమే మా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని డొల్ల మాటలు చెబుతూ రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని రాబోయే రోజులలో ఈ ప్రభుత్వాలకు రైతులు తగు చాస్తి చేస్తారని, కాల్పుల్లో చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని, రైతు ఉద్యమంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చనిపోయిన రైతులకు కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని ఏఐకెఎస్సిసి సంయుక్త రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు దొడ్డ లక్ష్మీనారాయణ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: