CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు

Share it:

 



వాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు శివలింగాపురం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మణుగూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాక్సినేషన్ సెంటర్ ను శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ప్రారంభించారు. ఈ వాక్సినేషన్ సెంటర్ లో 18 నుండి 44 సంవత్సరాల లోపు వాళ్లకు మరియు 45 సంవత్సరాలు పైబడిన వాళ్లకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు.ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు.వ్యాక్సిన్ సెంటరుకు వచ్చిన వారిని, వ్యాక్సిన్ వేసుకున్న వారిని, ఎమ్మెల్యే రేగా కలిసి, వ్యాక్సిన్ వేసుకోవడం పట్ల అభిప్రాయాలను అడిగి, తెలుసుకున్నారు.వ్యాక్సిన్ వేసుకున్న వారికి ధైర్యంగా ఉండండి అని,మీకు రోగ నిరొదక శక్తి పెరుగుతుంది అని వారికి భరోసా కల్పించారు.కరోనా వ్యాధి ని వ్యాక్సినేషన్ ద్వారా నే నియంత్రణ చేయవచ్చు అని తెలిపారు.వ్యాక్సినేషన్ తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ నాగ ప్రసాద్,ఏ ఈ సత్య,డాక్టర్ మౌనిక,మెడికల్ సిబ్బంది మరియు అధికారులు, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు,వర్కింగ్ మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,వర్కింగ్ ప్రెసిడెంట్ బోలిశెట్టి నవీన్,టిఆర్ఎస్ నాయకులు ముద్ధంగుల. కృష్ణ,తంత్రపల్లి.కృష్ణ, వేముల లక్ష్మయ్య,గుగులోత్ గణేష్,తాత రమణ,సోషల్ మీడియా ఇంచార్జి సిరికొండ శ్యాం సుందర్ రావు, యువజన నాయకులు బొశెట్టి.రవి ప్రసాద్,గుర్రం సృజన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: