CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉పట్టణాల్లో మురుగు నీరు వెళ్లడానికి అవకాశం లేకుండా నాళాలు ఆక్రమించి అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను తక్షణం తొలగించాలి.

Share it:


👉మున్సిపల్ కమిషనర్లును ఆదేశించిన జిల్లా కలెక్టర్ అనుదీప్.

👉మణుగూరు మున్సిపాల్టీలో నాళాపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించిన మున్సిపల్ కమిషనర్‌కు ప్రశంసల జల్లు

మన్యం టీవీ కొత్తగూడెం::- జూన్ 11 శుక్రవారం

కలెక్టరేట్ సమావేశపు హాలు నందు డ్రెయిన్లుపై నిర్మాణాలు, పచ్చదనం, పరిశుభ్రత, ప్రజా మరుగుదొడ్లు వినియోగం,

ఇంటింటి వ్యర్థాలు సేకరణ, డంపింగ్ యార్డులు నిర్వహణ, సిబ్బంది సమయ పాలన, వాహనాలు వినియోగం, డస్ట్ బిన్స్

తొలగింపు, వ్యర్థాలు సేకరణ, మురుగు కాల్వలు శుభ్రపరచుటలో యంత్రాలు వినియోగం తదితర అంశాలపై మున్సిపల్

సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు మున్సిపాల్టీలో నాళాపై

నిర్మించిన నిర్మాణాలను తొలగించడం పట్ల మున్సిపల్ కమిషనర్‌ను అభినందించారు. పారిశుద్య సిబ్బంది సమయపాలన

పాటించు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మున్సిపల్ కమిషనర్లు వార్డుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పారిశుద్య

కార్యక్రమాలను పర్యవేక్షణ చేయాలని చెప్పారు. వ్యాపారులు వ్యర్థాలను బుట్టల్లో వేయాలని, ఆరుబయట వేయకుండా

అవగాహన కల్పించాలని చెప్పారు.

రహదారులపై వ్యర్ధాలు వేసే వ్యక్తులకు జరిమాన విధించాలని, వ్యర్థాలను తొలగించుకుంటూ

పోతుంటే మళ్లీ మళ్లీ వేస్తుంటారని కఠినంగా వ్యవహరించకపోతే మార్పును ఆశించలేమని చెప్పారు.

బవిష్యత్తును దృష్టిలో

ఉంచుకుని మున్సిపాల్టీలలో యంత్రాలు వినియోగం ద్వారా పారిశుద్య కార్యక్రమాలు, వ్యర్ధాలు తొలగింపు యంత్రాలను

వినియోగంలోకి తేవాలని చెప్పారు.

ప్రతి ఒక్కరూ డస్టన్స్ లో చెత్త వేయడం వల్ల తీసేవారితో పాటు ప్రజలు కూడా

ఇబ్బంది పడుతున్నారని అందువల్ల డస్ట్బను తొలగించాలని చెప్పారు. ఇంట్లోనే తడి, పొడి చెత్తబుట్టలు ఏర్పాటు

చేసుకుని చెత్తను పారిశుద్య సిబ్బందికి అప్పగించు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 

ప్రతి మున్సిపాల్టీలో నూరు

శాతం ప్రతి ఇంటి నుండి వ్యర్థాలు సేకరణ జరగాలని, వ్యర్థాల సేకరణకు సమయపాలన పాటించాలని చెప్పారు. 

పాల్వంచలో

ఇంటింటి నుండి వ్యర్థాలు సేకరణ ప్రక్రియను బాగా చేస్తున్నారని సిబ్బందిని అభినందించారు. మున్సిపాల్టీల అభివృద్ధిలో

ఆహ్లాదకర పోటీ ఉండాలని చెప్పారు. 

ఖాళీ ఇంటి స్ధలాల యజమానులు శుభ్రం చేసుకొని వి నోటీసులు జారీ చేయాలని,

నిర్దేశిత సమయంలో పరిశుభ్రతం చేయకపోతే మున్సిపాల్టీ ద్వారా పరిశుభ్రం చేయించి యజమానుల నుండి ఖర్చులు వసూలు

చేయు విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లును ఆదేశించారు. 

కెటిపిఎస్, సింగరేణి తదితర సంస్థల సిబ్బంది

నివసించు కాలనీల్లో డస్ట్ బిన్స్ తొలగించి ఇంటింటి నుండి వ్యర్థాలు సేకరణ చేయు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

రహదారుల వెంబడి ఉన్న పిచ్చి మొక్కలు తొలగించడానికి యంత్రాలు కొనుగోలు చేయాలని చెప్పారు. 

ప్రజా మరుగుదొడ్లులో

పరిశుభ్రత పాటించాలని చెప్పారు. 

పచ్చదనం పెంపొందించుటలో భాగంగా మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించాలని

చెప్పారు. 

మున్సిపాల్టీలలో విధులు నిర్వహించు సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లింపులు చేయాలని ఆదేశించారు.

పారిశుద్య కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతుండాలని బ్లీచింగ్, సోడియ హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ప్రే చేయాలని

చెప్పారు.

ఈ సమీక్షా సమావేశంలో కొత్తగూడెం, ఇల్లందు, పాల్వంచ మున్సిపల్ కమిషనర్లు సంపత్ కుమార్, శ్రీనివాసరెడ్డి,

శ్రీకాంత్, డీఈలు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: