CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చండ్రుగొండ మండలం లో విస్తృతంగా పర్యటించిన అశ్వారావుపేట ఎమ్మెల్యే

Share it:

 


•మెచ్చా నాగేశ్వరరావు.


 చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :


అశ్వారావుపేట  శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు శనివారం చండ్రుగొండ మండలంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏరిస్ ఆగ్రో సంస్థ వితరణ చేసిన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ ను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరానికి చేరుకొని నామా నాగేశ్వరరావు ద్వారా వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను 9 మంది లబ్ధిదారులకు రెండు లక్షల 79 వేల ఐదు వందల రూపాయలను పంపిణీ చేశారు. అనంతరం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరొనా కష్టకాలంలో అభివృద్ధి పనులు సాఫీగా జరుగలేదని ఇక ముందు అలా జరగకుండా అధికారులు గ్రామాల్లో అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలన్నారు. పంచాయతీ సిబ్బంది వ్యక్తిగత భద్రత పాటిస్తూ గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రతి రోజు నిర్వహించాలని అలా నిర్వహించడం వల్ల గ్రామాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా  పూర్తిగా కట్టడి చేయగలిగారు అన్ని  అన్నారు. జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడం కొరకే తన నియోజకవర్గ ప్రజల నిర్ణయం మేరకు టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు డైరెక్టర్లు, స్థానిక లీడర్లు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని పార్టీలకతీతంగా అన్ని గ్రామ పంచాయతీలు సస్యశ్యామలంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా వర్గపోరు అనే విషయం నా దృష్టికి రావద్దని అందరూ ఐక్యంగా ఉండి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ సంజీవ రావు, తహశీల్దార్ ఏం ఉషా శారద, ఎంపీడీవో జి అన్నపూర్ణ, ఎంపీవో తోట తులసీరామ్,  సిడిపిఓ నిర్మల జ్యోతి, ఎంపీపీ బానోత్ పార్వతి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎస్డి రసూల్, జెడ్పిటిసి కొడగండ్ల వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ నరకుల్లా సత్యనారాయణ, గుంపెన గానుగుపాడు సొసైటీ చైర్మన్ లు బోయినపల్లి సుధాకర్, చెవుల చందర్ రావు, దారా బాబు, టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ, మండల అధ్యక్షులు బోజ్యా నాయక్, చీదెళ్ళ పవన్, మండల నాయకులు మేడా మోహన్ రావు, డైరెక్టర్ ఉన్నం నాగరాజు, నల్లమోతు వెంకటనారాయణ, టిడిపి మండల అధ్యక్షుడు వారధి సత్యనారాయణ, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: