CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దోమతెరలు పంపిణీ చేసిన ఎంపీపీ

Share it:

 



 మన్యంటీవీ, అశ్వారావుపేట:

మండల పరిదిలోని వినాయక పురం గ్రామ పంచాయితీ లో ప్రభుత్వం చేత విడుదల చేయబడిన దోమతెరలు పంపిణీ చేసిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ యొక్క దోమతెరలు చాలా విలువైనవి మన్నికైనవి అని తెలియజేస్తూ ఈ దోమతెరలు ఉపయోగించటం వల్ల మనిషికి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్య, బోదకాలు, మెదడు వాపు వ్యాధి మొదలగునవి వ్యాధులు రాకుండా ఉంటాయి అని తెలియజేయడం జరిగింది. ఈ దోమ తెర మీద ప్రత్యేకంగా తయారు చేసినటువంటి క్రిమిసంహారక మందు డెల్టా మైత్రీన్ ఉండటం వల్ల దోమ తెర పై దోమలు వాలిన వెంటనే అవి చనిపోయి కింద రాలిపోవడం జరుగుతుందని తెలియజేశారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఐదు సంవత్సరాలలోపు పిల్లలలు నిద్రించే టప్పుడు ఈ దోమ తెర వాడటం చాలా మంచిదని గిరిజన ప్రాంతాల్లో ప్రమాదకరమైన వ్యాధులు సంక్రమిస్తాయని ఉద్దేశంతో ముఖ్యమంత్రి కెసిఆర్ పంపించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలోని అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇవ్వడం జరిగిందని, దానిలో భాగంగా అశ్వారావుపేట మండలం లో వినాయకపురం పిహెచ్సిలో 5195 గుమ్మడవెల్లి పిహెచ్సిలో 5044 పంచడం జరుగుతుందని తెలిపారు. ఈ దోమతెరలు మూడు విభాగాలలో ఉన్నాయని అవి 3/6, 4/6, 6/6 సైజులో విభజించి పంచడం జరుగుతుందన్నారు. సింగిల్ వ్యక్తికి 3/6, భార్యభర్తలకు 4/6, అలాగే భార్య భర్త చిన్న పిల్లలు వున్నా కుటుంబానికి 6/6 గా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మండల వ్యాప్తంగా 3/6 సైజ్ గలవి 1843, 4/6 సైజ్ గలవి 5785, 6/6 సైజ్ గలవి 2598 వచ్చాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జడ్పిటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి, వినాయకపురం సర్పంచ్ సత్యవతి, ఎంపీటీసీ లలితా మరియు డా" హరీష్, రాంబాబు, సూపర్ వేజర్ వెంకటేశ్వర రావు, శ్రీనివాస రావు ,హెచ్ఈఓ రాజు, ఎయెన్ఏం సావిత్రి, జ్యోతి, హెల్త్ అసిస్టెంట్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: