CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా, బ్లాక్ ఫంగస్ ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలి

Share it:

 


*ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి.

మన్యం టీవీ ఏటూరు నాగారం

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న అటువంటి కరోనా మహమ్మారి కి వైద్యం అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా బారిన పడినట్టు వంటి వారిని రక్షించడంలో పూర్తిస్థాయిలో విఫలం అయిందని కరోనాను బ్లాక్ ఫంగస్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఉచిత వైద్యం అందించాలని దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రికి వారి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల, మంత్రులపై పెట్టినంత దృష్టి కరోనా పై దృష్టి ఎందుకు పెట్టడం లేదని అని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సామాన్యుడిపై నడ్డివిరిచే విధంగా నిత్యావసర సరుకుల పై మరియు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకు పోతున్నాయి తప్ప కరోనా కు సంబంధించిన టీకాలు వేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో విఫలమయ్యాయని ఇప్పటికైనా దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా వారికి చికిత్స అందించాలని ప్రైవేట్ హాస్పిటల్ లను ప్రభుత్వ పరం చేసుకొని పూర్తి వైద్యాన్ని అందించాలని కాంగ్రెసు పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేంద్ర గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోతు రవి చందర్, మండల అధ్యక్షులు ఎండి చాంద్ పాషా, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు మట్టేవాడ తిరుపతి, యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వంశీకృష్ణ, నర్సాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు బొచ్చుఅశోక్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు మామిడిశెట్టి కోటి, వార్డు సభ్యులు రవి, విజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: