CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతున్న ఇసుక కాంట్రాక్టర్లు

Share it:

 


*భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు.

*ముడుపుల మత్తులో మైనింగ్ శాఖ అధికారులు

*మూడు పువ్వులు ఆరు కాయలుగా మండలంలో ఇసుక వ్యాపారం


మన్యం టీవీ,బూర్గంపాడు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

బూర్గంపాడు మండలం సోంపల్లి  గ్రామపంచాయతీ లోని బుడ్డ గూడెం గ్రామంలోని కిన్నెరసాని నది ఒడ్డు నుండి అనుమతులు లేకుండా భారీ యంత్రాలు పెట్టి సీతారామ ప్రాజెక్టు సంబంధించిన ఓ కాంట్రాక్టర్ ఇసుక తోలుతున్నారు.దీని గురించి అధికారులను అడుగగా మాకు ఎటువంటి సమాచారం లేదు అని చెప్పడం జరిగింది.అలాగే స్థానికంగా ఉన్న సర్పంచ్కు తెలియకుండా భారీ యంత్రాలు పెట్టి ఇసుక తోలడం జరిగింది.ఇది ఇలా ఉండగా 1/70 యాక్టు ప్రకారం భారీ యంత్రాలు పెట్టి ఇసుక తవ్వకాలు జరపకూడదు. లేబర్స్ తోనే ఇసుక తోలకాలు జరపాలి.కనీసం ఇసుక రీచ్ ఎక్కడ ఇచ్చారు,ఇసుక ఎక్కడి నుంచి తేలుతున్నారు,ఎన్ని ఫీట్లు తేలుతున్నారు,అని తెలుసుకోవడానికి కనీసం మైనింగ్ శాఖ అధికారులు కూడా ఇటు రావడం లేదు.ఏది ఏమైనప్పటికీ భూగర్భ జలాలు తగ్గుతున్న సమయంలో ఇలాంటి భారీ యంత్రాలకు పెట్టి ఇసుక తోలుకోమని ఏ అధికారి చెప్పారో అలాగే ఆ  కాంట్రాక్టర్ పై అధికారులు విచారణ చేసి  చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు. 

Share it:

Post A Comment: