CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వలస ఆదివాసీల ఆరోగ్యం కోసమే వాటర్ ఫిల్టర్లు

Share it:

 


*మణుగూరు  ఏ ఎస్ పి శబరీష్*మన్యం టీవీ, అశ్వాపురం:

వర్షాకాలంలో  వలస ఆదివాసీలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలని స్వచ్ఛమైన మంచినీరు తాగాలనే ఉద్దేశంతో  జిల్లా ఎస్ పీ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాటర్ ఫిల్టర్లు పంపిణీ చేశామని మణుగూరు ఏ ఎస్ పి శబరీష్ అన్నారు.  అశ్వాపురం మండలం లోని వలస ఆదివాసీ గ్రామాలైన  గుట్ట బోరు , గుండ్ల మడుగు సంతోష్ గుంపు  గ్రామాలకు  చెందిన 78 కుటుంబాలకు గొందిగూడెం లో మంగళవారం  అశ్వాపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏఎస్పి శబరీష్ చేతుల మీదుగా వాటర్ ఫిల్టర్లు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఏ ఎస్పీ మాట్లాడుతూ *ఆదివాసీలు మావోయిస్టులు  పట్ల ఆకర్షితులు కావద్దని వారికి సహకరించవద్దనికోరారు.  *మావోయిస్టులలో చేరినవారు అనారోగ్యాలకు గురి అయి ఉంటే వారు పోలీసులకు సరెండర్* *అయితే వారికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు*

గుత్తి కోయ గ్రామాల అభివృద్ధికి గిరిజనులకు  పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మా వంతు సహకారం అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో లో సి ఐ సట్ల  రాజు,  ఎస్ఐ రాజేష్ సర్పంచులు పాయం భద్రమ్మ,  పర్సిక సూరిబాబు , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: