CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దేశవ్యాప్తంగా రోజుకి కోటి మందికి కరోనా వ్యాక్సిన్ అందించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెమోరండం అందజేసిన జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగా.సీతారాములు

Share it:

 


మన్యం టీవీ పాల్వంచ:- ఈరోజున ఏఐసిసి పిలుపుమేరకు భద్రాద్రి కొత్తగూడెం  కాంగ్రెస్ పార్టీ జిల్లాఅధ్యక్షులు భద్రాచలం శాసనసభ్యులు పొదెం. వీరయ్య ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఒక రోజుకి కోటి మందికి ఉచిత కరోనా వ్యాక్సిన్ అందించాలని నేడు జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగా.సీతారాములు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డి ఆర్ ఓ అశోక చక్రవర్తి కి మెమోరండం ఇవ్వడం జరిగింది

👉🏻ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగా. సీతారాములు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నేడు కేవలం 16 లక్షల మందికి మాత్రమే కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారని ఇలా ఇస్తే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ అందించాలంటే కనీసం మూడు సంవత్సరాలు పడుతుందని అన్నారు 

👉🏻అలాగే ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ ధరలు మూడు రకాలుగా అంటే కేంద్రం అందించే ధరలు, రాష్ట్ర ప్రభుత్వ ధరలు, ప్రైవేట్ ఆస్పత్రుల ధరలు, వేరువేరుగా ఉన్నాయి అలా కాకుండా దేశవ్యాప్తంగా గా ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించికోరారు..

👉🏻రాబోయే డిసెంబర్ 31- 2021 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించాలని  ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

👉🏻అలాగే కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచి త్వరితగతిన కరోనా వ్యాక్సిన్ ప్రజలందరికీ అందించి రాబోయే మూడవ దశ కరోనా నుండి దేశ ప్రజలను కాపాడాలని కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని కోరడంజరిగింది.

👉🏻ఇప్పటికైనా ప్రధాని మోడీ కరోనా పట్ల కృతనిశ్చయంతో పనిచేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.

👉🏻ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం మూడు శాతం ప్రజలకు మాత్రమే కరోనా  వ్యాక్సిన్ అందించారు అని పేర్కొన్నారు

👉🏻 అలాగే చిన్న పిల్లలలో కరోనా తీవ్రత పెరుగుతుంది కాబట్టి ప్రతి జిల్లా కేంద్రంలో చిన్న పిల్లల కోసం కరోనా కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు

👉🏻 ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపాలిటీ 29వ వార్డు కౌన్సిలర్ లక్ష్మణ్,జిల్లాయూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ షేక్ అబీద్, యూత్ కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: