CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతి ధ్యానం

Share it:

 


-నిర్మలత్వం కలిగించేదే యోగా

-  వివేకానంద కంప్యూటర్స్ లో  ఘనంగా యోగా దినోత్సవం

మన్యం మనుగడ, పినపాక:

 భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతులలో ధ్యానం ఒకటని,

మనసుకి స్వస్థత, నిర్మలత్వం కలిగించేదే యోగా అని 

స్వామి వివేకానంద స్పూర్తితో ప్రపంచ దేశాలతోపాటు యోగాకి పుట్టినిల్లైన ఇండియాలో యోగా దినోత్సవం ప్రాముఖ్యత చాటుతుందని శ్రీ వివేకానంద కంప్యూటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీరాం బృహస్పతి అన్నారు.విద్యార్థులతో యోగా ప్రాముఖ్యత తెలియచేసినారు.

ప్రపంచానికి యోగాను అందించిన భారతదేశం  ప్రతి సంవత్సం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటోందన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు  యోగాసనాలు చేస్తున్నారని, కరోనా రోజుల్లో యోగాసనాలు చేయడం ద్వారా అనారోగ్యాలు చాలా వరకూ తగ్గుతాయని , డాక్టర్లు కూడా యోగా ద్వారా జబ్బులను నయం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.

యోగా మనకు ఒత్తిడి నుంచి బలం అలాగే ప్రతికూలత నుంచి సృజనాత్మకత వైపు పయణించేందుకు మార్గం చూపిస్తుందని, ఎన్నో సమస్యలు ఉండొచ్చు, కానీ, మనలో అనంతమైన పరిష్కారాలను కనుగొనే శక్తి దాగి ఉందని యోగా వెల్లడిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బూర శంకర్,నాగేందర్, కార్యదర్శి భరత్, నాంపల్లి విజయ్, కొప్పుల సంపత్, కీసర సుధాకర్ రెడ్డి,విద్యార్థిని విద్యార్థులు సాయి నివేదన్, ప్రవళిక,శ్రావ్య, నీలిమ,ప్రవీణ్,భాగ్యలక్ష్మి, తదితరులు  పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: