CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బదిలీలతో సరిపెట్టొద్దు నిధులు రికవరీచెయండి

Share it:

 


 పంచాయతీకార్యదర్శుల బదిలీలపై ప్రజలఅసంతృప్తి

మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండలంలో నిధులదుర్వినియోగానికి పాల్పడిన పంచాయతీ కార్యదర్శులను జిల్లా పంచాయతీఅధికారులు కేవలం బదిలీచేసి చెతులు దులుపుకున్నారని,గతమూడేళ్ళుగా గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధుల లెక్క తేల్చకపోవడం పై అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. మంగపేట మండలంలో సర్పంచులు, యం.పి.టి.సి.లు.యం.పి.పి.లు లేకపోవడంతో మండలంలోకొద్దిమంది కార్యదర్శులు బినామీ పేర్లతో నాసిరకంగా కాంట్రాక్టు పనులుచేసి ప్రజల సొమ్మును లక్షల్లో దుర్వినియోగంచేసి స్వంతజేబులు నింపుకున్నారని, అవసరంలేని పనులకు నకిలీ విడిసిలు సృష్టీంచి, జరపని గ్రామసభల పేరుతో అనుమతులు తయారుచేసి పనులు చేపట్టారన్నారు.

  

 ప్రభుత్వం చేపట్టీన పల్లెప్రకృతి పనుల్లో బోర్లు, మొక్కలు, ఫెన్సింగ్ వైర్లు పేరున, గ్రామాల్లో ఏర్పాటుచేసిన స్ట్రీట్ లైట్లపేరున,డ్రైనీజీల నిర్వహణ,తదితరాలపేరుతో అందినకాడికిప్రజలసొమ్మును దోచుకున్నారన్నారు.గ్రామపంచాయతీలకు ఫర్నీచర్ కొనుగోలు,ప్రభుత్వం గ్రామపంచాయతీలకు కేటాయించిన మంచినీటి ట్యాంకర్లు, ట్రాక్టర్లనిర్వహణ,డీజిల్ ఖర్చులు పేరుతో అధికబిల్లులు సృష్టించినిధులు కాజేశారన్నారు. మంగపేట మండలంలోనిగ్రామపంచాయతీలలో జరుగుతున్న అవినీతి లెక్కల నిగ్గుతేల్చాలని జిల్లా ఉన్నతాధికారుల కుఎన్నిమార్లు ఫిర్యాదులు చేసినా,వార్తాపత్రికలద్వారా వెలుగులోకి తెచ్చినా అజిల్లాఅధికారులు పట్టించుకోకపోవడంతో పంచాయతీకార్యదర్శు తాము ఆడిందేఆటగా ప్రజలసొమ్మును అందినకాడికి దోచుకున్నారన్నారు.ఇంతజరిగినా ఉన్నతాధికారులు నిధులరికవరీని చేపట్టకుండా తూతూమంత్రంగా బదిలీలు చేసి చేతులు దులుపుకున్నారని,ప్రజలసొమ్మును అడ్డగోలుగా తినడానికి అలవాటుపడ్డ ఒకరిద్దరు కార్యదర్శులు తమ భజన పరులతో బదిలీలను నిలుపుచేయించడానికి అవసరమైనఅడ్డదారులు తొక్కుతూ సోషల్ మీడియాలోసైతం తామునీతిమంతులమనిప్రచారం చేయించుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టరు, పంచాయతీ అధికారులు మంగపేట మండలంలోనిగ్రామపంచాయతీలకు మంజూరైన నిధులు,అభివృధ్ధిపనులపేరుతో కార్యదర్శు లు చేసిన ఖర్చులను ప్రజలసమక్షంలో సోషల్ ఆడిట్ నిర్వహించి, అవినీతికిపాల్పడిన కార్యదర్శులనుండిప్రజలసొమ్మును కక్కించేలా చర్యలు చేపట్టాలని మంగపేట మండలప్రజలుజిల్లా ఉన్నతాధికారులను కోరుతున్నారు.

Share it:

Post A Comment: