CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అవినీతి అధికారులకు కొమ్ముకాయడము సిగ్గుచేటు

Share it:

 


నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కార్యదర్శులను ట్రాన్స్ఫర్ కాదు సస్పెండ్ చెయ్యాలి

మన్యం టీవీ మంగపేట.


గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ మంగపెట మండల అధ్యక్షులు జయరామ్ రెడ్డి  ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించడము జరిగింది. ఈ కార్యక్రమం లో జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి. సోమయ్య ఈ సందర్బంగా మాట్లాడుతూ  

 నిధుల దుర్వినియోగం, అవినీతిపై విచారణ జరిపి నిదులను రికవరీ చెయ్యాలి. మండలంలొ గ్రామ పంచాయతీలకు సర్పంచ్ లు లేకపోవడంతో కొందరు పంచాయతీ కార్యదర్శులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా గ్రామ సభలు నిర్వహించకుండా దొంగ తీర్మానాలు నిర్వహించి లక్షల రూపాయల నిధులను కాజేస్తున్నారు. అలాంటి అవినీతి కార్యదర్శులను బదిలీ చేస్తే వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తూ వారి అవినీతి అక్రమాలకు కొందరు వంతపాడుతూ అధికారులకు తొత్తులుగా మారడం హాస్యాస్పదం, కమలాపురంలో లో రద్దయిన వీడీసీ కమిటీ  పేరుతొ గ్రామ సభల తీర్మానాలు లేకుండా లక్షల రూపాయలు  వెచ్చించి గెస్ట్ హౌస్ లు, సైడ్ డ్రైనేజ్ లు చికెన్ షెడ్ లు నిర్మించిన విషయము విచారణ జరిపించాలి. అదే విదంగా మండల అభివృద్ధి కోరుకునే నాయకులు ప్రతి ఒక్కరూ ఆయా గ్రామాల్లో పంచాయతీ నిధుల దుర్వినియోగం పై పూర్తి సమాచారం తెలుసుకుంటే ఏ పంచాయతీ కార్యదర్శి ఎంత అవినీతికి పాల్పడ్డారని తేటతెల్లం అవుతుంది. అంతే  తప్ప అవినీతి అధికారుల పంచన చేరి కాంట్రాక్టు పనులు దక్కించుకునేందుకు వారి మెప్పుని పొందేందుకు సోషల్ మీడియాలో అసత్యపు ఆరోపణలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు హితవు పలికారు. ఈ కార్యక్రమములొ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,మండల అధ్యక్షులు జయరామ్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి అయొరి యానయ్య,  యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మురుకుట్ల నరేందర్, సిద్ధ బత్తుల జగదీష్,కొమురం బాలన్న,తాలూకా సంపత్,ఆకు పవన్,యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కర్రి నాగేందర్ బాబు,కుమురమ్ సారయ్య,పొలెబొయిన రాంబాబు,మహమ్మద్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: