CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై పీడీ యాక్టుల నమోదుకు రంగం సిద్ధం

Share it:

 


వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి  మరియు రాష్ర్ట డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి ఐపీఎస్ పోలీసు శాఖ మరియు వ్యవసాయ శాఖ అధికారులతో  వీడియో కాన్ఫెరెన్సు ద్వారా ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్.

మన్యం టీవీ కొత్తగూడెం :-

ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరియు రాష్ట్ర డిజిపి ఎం.మహేందర్ రెడ్డి ఐపీఎస్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో మరియు వ్యవసాయ శాఖ అధికారులతో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

 ఈ సమావేశంలో నార్త్ జోన్ ఐజి వై.నాగిరెడ్డి ఐపీఎస్ కూడా పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి ఏఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్, డిఎస్పీ(నోడల్ ఆఫీసర్) ఆదినారాయణ, ఎసిబి ఇన్స్పెక్టర్ బాలాజీ,డీసీఆర్బీ సిఐ రమేష్,సీసీఎస్ ఇన్స్పెక్టర్ పుల్లయ్య మరియు జిల్లా వ్యవసాయాధికారులు ఏడిఏ లాల్ సింగ్ మరియు తదితరులతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ నకు హాజరయ్యారు.

ఈ సమీక్షా సమావేశంలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసు అధికారులు మరియు వ్యవసాయ అధికారులు తీసుకుంటున్న చర్యల గురించి జిల్లాల వారీగా గౌరవ మంత్రివర్యులు అడిగి తెలుసుకున్నారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లైసెన్స్ లేని 30,00,000/-ల రూపాయల విలువ గల విత్తనాలను సీజ్ చేయడం జరిగిందని ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ వివరించారు. 

జిల్లాలో గత సంవత్సరం 10 కేసులు ఈ సంవత్సరం ఇప్పటివరకు 03 కేసులను నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

నకిలీ విత్తనాలు, లైసెన్స్ లేని పత్తి మరియు మిర్చి విత్తనాలను విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కేసులను నమోదు చేస్తున్నామని తెలిపారు. 

అంతేకాకుండా ఇప్పటి వరకూ నకిలీ విత్తనాలను విక్రయిస్తూ పట్టుబడిన వారిపై పీడీయాక్ట్ లను కూడా నమోదు చేయడానికి చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: