CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కోవిడ్ నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగం సేవలు హర్షణీయం:జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య

Share it:

 


మన్యం టీవీ కొత్తగూడెం:- శుక్రవారం

కొత్తగూడెం క్లబ్బు నందు వైద్య ఆరోగ్య శాఖ, మిషన్ బగీరథ, హరితహారం, అటవీశాఖ కార్యక్రమాలపై జడ్పీ చైర్మన్ కోరం

కనకయ్య అధ్యక్షత నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పీ

వైస్ ఛైర్మన్ చంద్రశేఖర్ రావు, గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, జడ్పీ సిఈఓ విద్యాలత, డిప్యూటి సిఈఓ నాగలక్ష్మి

తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలైన పల్లె పకృతి వనాలు, డంపింగ్ యార్డులు,

వైకుంఠ దామాలు, హరితహరం, బృహత్ పల్లె వకృతి వనాలను సకాలంలో పూర్తి చేయాలని చెప్పారు. జూలై మాసము నుండి పాఠశాలు

ప్రారంభం అవుతున్నందున కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రం చేయించి విద్యాశాఖ

అధికారులకు అప్పగించాలని చెప్పారు. మండలస్థాయిలో జరిగే సర్వసభ్య సమావేశాలకు మండలస్థాయి అధికారులు హాజరయ్యే

విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. 2005 కంటే ముందు పోడుభూములు సాగుచేసుకుంటున్న గిరిజనులు నుండి

ఎందుకు భూములు తీసుకుంటున్నారని, అటవీ రెవిన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యను పరిష్కరించాలని చెప్పారు.

చట్టాలను ధిక్కరించి కందకాలు తీసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, వీసా గ్రామసభలు నిర్వహించాలని చెప్పారు. జిల్లాలో

వైద్య సేవలు నిర్వహణకు సిబ్బంది కొరత లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. ఆదివాసీ గ్రామాల్లో

సోలార్ ద్వారా మంచినీరందించేందుకు చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. గ్రామాల్లో మంచినీటి

సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్కను పరిష్కరించాలని చెప్పారు. భూమి

హక్కు పత్రాలు కలిగిన కుటుంబ యజమాని మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు రైతుబంధు వర్తించే విధంగా చర్యలు చేపట్టాలని

చెప్పారు. ఆన్లైన్లో తక్కువ భూమి చూపడం వల్ల కొంత మందికి రైతుబంధు నిధులు తక్కువగా వస్తున్నాయని, వాటన్నింటిని

సరిచేసి నిధులు మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్‌ఓఎస్ఆర్ డిటికి సూచించారు. రైతుబంధు వచ్చే భూముల్లో

కూడా కందకాలు తీశారని, గ్రామాలకు వెళ్లాలంటే గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారని పోడు భూముల సమస్యకు శాశ్వత

పరిష్కారం చేపట్టేందుకు నిజ నిర్ధారణ కమిటీలను ఏర్పాటు ద్వారా పరిష్కరానికి కృషి చేయాలని చెప్పారు.

సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన *ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మట్లాడుతూ* అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. జూలై 1-10వ తేదీ వరకు ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి

కార్యక్రమాలను చేపట్టనున్నందున అధికారులు సమాయత్తం కావాలని సూచించారు. రైతులు వ్యవసాయశాఖ పనుల్లో

నిమగ్నమయ్యారని ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. నకిలీ విత్తనాలు విక్రయించకుండా పటిష్ట

నియంత్రణ జరగాలని చెప్పారు. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన చేస్తున్నందున లోటుపాట్లును అధిగమించి జిల్లాను ప్రగతిపథంలో

ముందుంచాలని చెప్పారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరాన్ని చేపట్టి రెండున్నర సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేసిందని

చెప్పారు. భూమిహక్కు పత్రాలున్న గిరిజన రైతుల పొలాల్లో అటవీ అధికారులు ట్రెంను తవ్వడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం

చేశారు. గిరివికాస పథకం అమలు చేయకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని, బోర్డు వేయకుండా పంటలు ఏ విధంగా

పండిస్తారని, పంటలు లేకుండా ఎలా జీవిస్తారని ప్రశ్నించారు. 48 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాల్సి ఉండగా 18

గ్రామాలకు కల్పించారని 30 గ్రామాలకు ఎందుకు విద్యుత్ సౌకర్యం కల్పించలేదని విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడానికి గల

కారణాలపై తనకు సమగ్ర నివేదికలు అందచేయాలని ఆ ఎఫ్ ఆర్ డిటిని ఆదేశించారు. అసైన్ మెంట్ పెండింగ్ లో ఉన్న భూ

సమస్యలు పరిష్కారానికి కమిటి ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పెండింగ్ సర్వే

నెంబర్లులో ఉన్న భూ సమస్య పరిష్కారానికి ఆయా గ్రామాల్లోr సంయుక్త సర్వే నిర్వహించి సమస్యను పరిష్కరించాలని చెప్పారు.

క్లెయిమ్ సర్వే నెంబర్లుండి రైతుబంధు మంజూరు కానీ గిరిజనులకు రైతుబంధు నిధులు మంజూరు చేయు విధంగా చర్యలు

తీసుకోవాలని చెప్పారు. పాత పట్టాదారు పాసు పుస్తకాలున్న రైతులకు నూతన పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయాలని

చెప్పారు. చట్టాన్ని అతిక్రమించి ట్రెంచ్ తీసిన అటవీ, రెవిన్యూ అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సర్వసభ్య

సమావేశంలో చర్చించిన అంశాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టులు అందచేయాలని ఆయన సూచించారు.

ఈ సర్వసభ్య సమావేశంలో జడ్పీటిసిలు, యంపిపిలతో పాటు కో ఆప్షన్ సభ్యులు, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, డిపిఓ

రమాకాంత్, విద్యుత్ శాఖ ఎస్ఈ సురేందర్, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్,

జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, ఎఫ్డీఓ దామోదర్ రెడ్డి

తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: