CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వైద్యురాలిపై తప్పుడు ప్రచారాలు చేయడం సరైన పద్ధతి కాదు.

Share it:

 


•ఎంపిపి బానోత్ పార్వతి.

చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :

మహమ్మారి కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయ తాండవం చేస్తూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది. దీంతో ఎన్నో కుటుంబాల్లో పెద్ద దిక్కును కోల్పోయి ఎంతో మంది అనాధలుగా మారిన రోజులు ఇవి ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తమ వృత్తి ధర్మాన్ని పాటిస్తున్న మండల వైద్యురాలిపై తప్పుడు ప్రచారాలు చేయడం హేయమైన చర్య అని ఎంపీపీ బానోత్ పార్వతి అన్నారు. బుధవారం చండ్రుగొండ మండల కేంద్రంలో ఎంపీపీ బానోత్ పార్వతి అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ బోజ్యా నాయక్, వైస్ ఎంపీపీ నరకుల్లా సత్యనారాయణ, సహకార సంఘం సొసైటీ చైర్మన్ చెవుల చందర్ రావు, వైద్యురాలిపై వస్తున్న అసత్య ప్రచారాన్ని వారు తిప్పికొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కొవిడ్ మొదటి స్టేజ్ లో ఉన్నప్పుడే మండలంలో ప్రజలను అప్రమత్తం చేసారని విదేశాల నుంచి వచ్చిన వారిని సైతం హోం ఐస్ లేషన్ ఉంచి నిరంతరం వారిని పర్యవేక్షించి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ మండలంలో కరోనా వ్యాప్తి చెందకుండా అరికట్టడంలో మండల వైద్యాధికారి నీ డాక్టర్ ఎస్ గీత సఫలీకృతం అయ్యారు. గతంలో జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ఎంవి రెడ్డి కూడా చండ్రుగొండ మండలం లో జరుగుతున్న వైద్యసేవలను స్వయంగా పరిశీలించి వైద్య సిబ్బందిని ప్రత్యేకంగా డాక్టర్ ను అభినందించి గణతంత్ర దినోత్సవం వేడుకల్లో బెస్ట్ వైద్యాధికారిణి గా గుర్తింపు పత్రం కూడా ఇచ్చారు. అలాగే కరోనా సెకండ్ వెవ్ ఉదృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో మండలంలో ఎక్కువగా కరోనా కేసులు పెరుగుతున్న గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడే వైద్య సేవలు అందిస్తూ ఆయా గ్రామాల్లో ప్రజలను చైతన్య పరుస్తూ వ్యాధి ప్రబలకుండా కట్టడి చేయడంలో ఎనలేని కృషి చేశారు నిరంతరం కరోనా పేషెంట్ల వద్దకు వెళ్లి వారికి ధైర్యం చెబుతూ వారి స్థితిగతులను తెలుసుకొని వారికి కావాల్సిన మందులను అందిస్తూ ధైర్యం చెప్పడంలో ఆమె చేసిన కృషి అమోఘమన్నారు. మండల ప్రజలకు ఇంత సేవ చేస్తూ కరోనా వైరస్ కట్టడి లో భాగస్వామ్యం అయిన మండల వైద్యాధికారి ని పై రాజకీయ దురుద్దేశంతో తప్పుడు ప్రచారాలు చేయడం హేయమైన చర్య అని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం వైద్యులను కించపరిచేలా ప్రవర్తించటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నమన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా తో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారని అలాంటిది నిరంతరం ప్రజల్లో ఉంటూ వైద్య సేవలు చేస్తున్న వైద్యులపై రాజకీయ దురుద్దేశంతో కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఇదే విషయాన్ని డిఎమ్ హెచ్ఓ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

Share it:

Post A Comment: