CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేసిన పోడు బాధితులు

Share it:

 


👉రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన ఊకె చిట్టెమ్మ  కొమరం కౌసల్య

మన్యం మనుగడ,అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా అశ్వాపురం మండలం

జగ్గారం రెవిన్యూ పరిధిలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు కొందరు గిరిజనేతరులు అడ్డు పడటం గమనార్హం.అశ్వాపురం కాలువ బజార్ కు చెందిన 45 గిరిజన కుటుంబాలపై కొందరు రాజకీయ నాయకుల అండ తో విర్రవీగుతూ గిరిజనేతరులు రాళ్ళు కర్రలు గొడ్డలితో దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అశ్వాపురం గ్రామంలోని కాలువ బజారు కు చెందిన 45 నిరుపేద కుటుంబాలు అదే మండలానికి చెందిన జగ్గారం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 400 ప్రభుత్వ భూమిని వ్యయప్రయాసలతో సాగుకు సిద్ధం చేసుకుని 2001 సంవత్సరం పూర్వంనుంచే సాగు చేసుకుంటూ దానిపై జీవనం గడుపుతున్నారు. వారికి ఇది తప్ప వేరే ఆధారం లేదు. సదరు భూమిని అధికారుల ద్వారా సాగుకు ఉత్తర్వులు జారీ చేయించుకొని ఉన్నారు. అయినప్పటికీ ఈ భూమి పై కన్నేసి స్థానిక నాయకుల అండతో అశ్వాపురం మండలం మంచికంటి నగర్ కు చెందిన (ఊకె అన్నపూర్ణ భర్త వెంకటేశ్వర్లు, ఊకె సత్యం తండ్రి వెంకటేశ్వర్లు, కొమ్ముగూడెం గ్రామానికి చెందిన ఊకె నాగేశ్వరరావు తండ్రి రామయ్య, ఊకె రామయ్య, సోంది రమేష్ తండ్రి జగ్గయ్య, వర్ల ప్రసాదు, బిక్కం రాజయ్య, జగ్గారం గ్రామానికి చెందిన కంబాల వెంకన్న, కావేటి గట్టుమల్లి, నర్ర ఆనందరావు, నూకల మల్లయ్య, దూదిమెట్ల వెంకన్న, జీవనపిల్లి రాములు, కడారి ముత్తయ్య)* తదితరులు ఈ సాగు భూమిని ఆక్రమించుకోవాలని దురుద్దేశంతో తమపై కర్రలతో రాళ్లతో దాడి చేస్తూ...మేము సాగుచేస్తున్న భూమిని వారికి వదిలి పెట్టకపోతే మమ్మల్ని చంపుతామని బెదిరించడం వలన మేము ప్రాణభయంతో వచ్చేసాము సదరు భూమికి హద్దులు తూర్పు ఎర్ర బొక్కల చెరువు పడమర  రైలు కట్ట ఉత్తరం తీగల వాగు  దక్షిణం వర్జ హనుమంతు...

కావున తమరు దయతో పై విషయం విచారించి మేము సాగు చేస్తున్న భూమి కి అడ్డు వస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోని మాకు న్యాయం చేయవలసిందిగా బాధితులు విన్నవించారు.

Share it:

TELANGANA

Post A Comment: