👉మొక్కల సంరక్షనే...పర్యావరణ పరిరక్షన... అంటున్న తహసీల్దార్ భగవాన్ రెడ్డి.
మన్యం మనుగడ, భద్రాచలం టౌన్:
భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలంలో రోడ్డు కు ఇరువైపులా నాటుతున్న మొక్కలను పరిసిసిలించిన బూర్గంపహాడ్ తహసీల్దార్ (MRO) భగవాన్ రెడ్డి నాటిన మొక్కలకు నీరూ పోస్తూ ట్రిగార్డులను ఏర్పాటు చేసి మొక్కలను సంరక్షించడం లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంబంధిత అధికారులకు తెలియజేసారు.ఇప్పటికే హరితహారం కార్యక్రమంలో ఏటా మొక్కలు నాటించి,పల్లెలు పచ్చదనంతో కళకళలాడేందుకు పక్కా ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని.నిరుపేదలకు ఉపాధి కల్పిస్తూనే ప్రతి ఏడాది మొక్కలు నాటి పెంచే కార్యక్రమాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది అని తహసీల్దార్ అన్నారు.మొక్కల సంరక్షనే పర్యావరణ పరిరక్షణ అని ఆయన అన్నారు.తహసీల్దార్ తో పాటు ఈ కార్యక్రమంలో RI అక్బర్,లక్ష్మీపురం గ్రామపంచాయతీ సెక్రెటరీ పనింద్ర,సర్వేర్ వినోద్,vra లు నాగేశ్వరరావు,సాయి ఉన్నారు.
Post A Comment: