CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా సూపర్ బజార్ పెట్రోల్ బంకు వద్ద జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగా. సీతారాములు ఆధ్వర్యంలో నిరసన

Share it:


మన్యం టీవీ పాల్వంచ :-

పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ ఈరోజుఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సూపర్ బజార్ లోని పెట్రోల్ బంకు వద్ద ఉదయం 12 గంటలకు నిరసన తెలియజేయడం జరిగింది..


👉🏻ఈ సందర్భంగా నాగా. సీతారాములు మాట్లాడుతూ కరోనా మహమ్మారి తో ప్రజలు ఒకవైపు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కేంద్రం మరో వైపు పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ ధరలను నిత్యం పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తుంది..అన్నారు..


👉🏻కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తూ అదాని, అంబానీల కు లభ్ది చేకూర్చేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు..


👉🏻దేశంలోని చాలా ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్కును దాటిందని, ఈ పెరుగుదల వల్ల అన్ని గృహవసరాలు మరియు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతుందని ఆయన వివరించారు..


👉🏻గత 13 నెలల్లో, పెట్రోల్ పై లీటర్ కు రూ.25.72 డీజిల్ పై లీటరుకు 23.93 పెరిగాయని, ఈ ఐదు నెలల్లో 43 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా దోపిడీకి ఇది ఒక ఉదాహరణ అని నాగా. సీతారాములు అన్నారు.


👉🏻ఈ బహిరంగ దోపిడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరంతరం ప్రజల తరుపున పోరాటాలు చేస్తామని.. అన్నారు..

 

👉🏻పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ..జీఎస్టీ పరిధిలో కి పెట్రోల్ ధరలను తీసుకొని రావాలని అన్నారు ..

 

👉🏻ఈ పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల ఆర్థిక మందగమనం, విపరీతమైన నిరుద్యోగం, వేతనాలలో కోత, ఉద్యోగ నష్టాలు మరియు అధిక ధరల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని. ఈ ప్రజా వ్యతిరేక అంశాలపై మనం నిరంతరం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


👉🏻నేడు పెట్రోల్ ,డీజిల్, గ్యాస్ అనేవి ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువు గా ఉందని తెలిపారు..

కాబట్టి సామాన్యులకు ఈ పెరిగిన ధరలు అందుబాటులో లేవని అన్నారు...

👉🏻ఈ కార్యక్రమంలో.. జిల్లా కాంగ్రెస్ నాయకులు చింతలపూడి రాజశేఖర్ ,మడిపల్లి శ్రీనివాస్, లోసెట్టి. శెట్టి నాగార్జున పంజాల.శ్రీనివాస్,చిమట. చంద్రయ్య, బీరెల్లి. భద్రం,పెద్ద. వెంకన్న, కొత్తగూడెం మున్సిపల్ వార్డు కౌన్సిలర్ తంగెళ్ల.లక్ష్మణ్, గరీబు పేట ఎంపీటీసీ కసన బోయిన. భద్రం,మహిళా కాంగ్రెస్ నాయకురాలు తంగేళ్ల కనకలక్మి, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ షేక్. అబీద్, మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్. కరీం పాషా, st.సెల్ మండల అధ్యక్షలు బి. మాన్సింగ్, రాఘవాపురం వార్డు మెంబర్ గరిక. జయరాజు,యూత్ కాంగ్రెస్ నాయకులు తెల్లబోయిన. వెంకటేష్, గణేష్, బి. సైదులు, బి.రవి ,కే. కోటేష్, నగేష్,y. రామకృష్ణ ,సాయి, బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: