CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దళిత ఎంపవర్మెంట్ పథకంతో దళితుల జీవితాల్లో వెలుగు రేఖలు

Share it:

 


👉జెడ్పిటిసి పోశం నర్సింహ రావు

👉 దళిత బాంధవుడు సీఎం కేసీఆర్: పినపాక నియోజకవర్గ దళిత ఐక్యవేదిక

మన్యం మనుగడ, మణుగూరు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో దళిత ఎంపవర్మెంట్ పథకం అమలు చేసిన సందర్భంగా పినపాక నియోజకవర్గం లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలు మేరకు నియోజకవర్గంలోని దళితుల ఆధ్వర్యంలో మణుగూరు పద్మశాలి భవన్ లో సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఈ కార్యక్రమానికి జడ్పిటిసి పోశం నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్య వైఖరి మూలంగా దళితులు అనేక రంగాల్లో వెనుకబాటుతనానికి గురై వారి జీవితాల్లో చీకటి అలుముకుంది అన్నారు. వారిలో వెలుగురేఖలు నింపడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత ఎంపవర్మెంట్ పథకం ప్రకటించడం హర్షణీయమన్నారు. ఈ పథకంతో యావత్ దళిత జాతి రూపురేఖలు మారడం ఖాయం అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలను మట్టి కరిపిస్తూ దళిత బడుగు వర్గాలకు ఆర్థిక స్వాలంబన సాదిస్తున్నారని అన్నారు. దళితులకు ప్రతిష్టాత్మకంగా దళిత సాధికారత పథకం తీసుక వచ్చి రాష్ట్రంలో 1200 కోట్ల రూపాయలు ప్రవేశ పెట్టి ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లను కేటాయించారని ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల ఇచ్చేందుకు ప్రభుత్వం ముందు కు వచ్చిందని డా బీఆర్ అంబేద్కర్ కలలు కన్న సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని అంబేద్కర్ కలలను సాకారం కావడానికే సీఎం కేసీఆర్ దళితులకు సీఎం దళిత సాధికారత పథకం తీసుక వచ్చి దళిత బాందవుడు అయ్యాడని , దళితుల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కేసీఆర్ అని కొనియాడారు. భవిష్యత్ తరాలకు ముందు చూపుగా అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొచ్చి అమలు చేయడం వల్ల ప్రతిపక్ష పార్టీల నాయకులకు వంటపడడం లేదని అన్నారు సీఎం కేసీఆర్ కు అభినందనలు తెలియజేసి హర్షం వ్యక్తం చేశారు.

     ఈ కార్యక్రమంలో .డా బీఆర్ అంబెడ్కర్ కలల సాకారం కై 

దళిత భాందవుడు సీఎం కేసీఆర్ 

అభినందన సభలో ...

మణుగూరు జెడ్పిటిసీ పోశం నరసింహారావు

మణుగూరు జూన్ 29: తెలంగాణ ప్రభుత్వ సీఎం కేసీఆర్ దళిత బాందవుడని డా బీఆర్ అంబేద్కర్ కలలు కన్న సాకారాన్ని నెరవేస్తున్నారని అన్నారు.

 దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో పినపాక నియోజకవర్గ స్థాయి అభినందన సభ యన్న అశోక్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది . నైనారపు నాగేశ్వరరావు, తడికమల్ల ప్రభుదాస్, మాదిగ జేఏసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సిద్దెల తిరుమలరావు ,మేకల రవి బోయిళ్ళ రమణయ్య, బోడ ఈశ్వరరావు, గోవర్ధన్ బూపెళ్లి నరసింహారావు నెల్లిపాక సర్పంచ్ గొర్రెముచ్చు వెంకటరమణ గంగారపు రమేష్ చిట్టిమల్ల ప్రవీణ్ గుర్రం సృజన్ పప్పుల ప్రసాద్ బోయిళ్ళ రాజు యన్న సంగీతారావు కొండ బాబూరావు చంద్రశేఖర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: