CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

2020-21ఎస్సీ కార్పొరేషన్ ఇంటర్వ్యూల షెడ్యూల్ ఖరారు.

Share it:

 


మన్యం టీవీ కొత్తగూడెం:-

భద్రాద్రి జిల్లా లో ఎస్సీ కార్యచరణ ప్రణాళిక 2020-21 అమలులో భాగంగా నైపుణ్య విభాగం క్రింద జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో ఈ దిగువ పేర్కొన్న తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ / చైర్మన్, జిల్లా షెడ్యూల్ కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ భద్రాద్రి కొత్తగూడెం వారు నేడు ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంటర్వ్యూ వివరాల జాబితా

తేదీ 22-06-2021 ఉదయం 10 గంటలకు, 

చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, పినపాక, కరకగూడెం, మణుగూరు, (రూరల్ మరియు మున్సిపాలిటీ) అశ్వాపురం బూర్గంపాడు.

తేదీ 23-06-2021 ఉదయం 10 గంటలకు ఆళ్ల పల్లి, గుండాల, ఇల్లందు (మండలం, మున్సిపాలిటీ). టేకులపల్లి,అశ్వరావుపేట.దమ్మపేట.

తేదీ 24-06-2021 ఉదయం 10 గంటలకు కొత్తగూడెం (మున్సిపాలిటీ). పాల్వంచ (మండలం. మున్సిపాలిటీ) ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, లక్ష్మిదేవిపల్లి, సుజాతనగర్, చుంచుపల్లి, జూలూరుపాడు. వారికి ఇంటర్వ్యూలు నిర్వహించబడును కావున సదరు అభ్యర్థులు కులం, ఆదాయం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మరియు సంబంధిత ఈ విభాగంలో అనుభవం ఉన్న ధ్రువపత్రాల తో సహా పైన పేర్కొన్న తేదీల్లో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయానికి హాజరు కాగలరని గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: