CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మూడు క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు.

Share it:

 


మన్యం టీవీ కొత్తగూడెం:- 

జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్  ఆదేశాల మేరకు విశ్వసనీయ సమాచారంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామా టాకీస్ ఏరియాలోని పల్లపోతు వాసు అనే వ్యక్తికి చెందిన ధనలక్ష్మి రైస్ మిల్ నందు  మూడు క్వింటాల పీడీఎస్ రైస్ ను పట్టుకున్నారు.

ఇట్టి పీడీఎస్ బియ్యాన్ని మార్వాడీ క్యాంపు,పాత కొత్తగూడెంలోని తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారుల వద్ద నుండి పాత కొత్తగూడెం నివాసురాలైన కమ్మంపాటి మహాలక్ష్మి అనే మహిళ తక్కువ ధరకు కోనుగోలు చేసి TS04UA 5150 అను నంబరు గల ఆటోలో లోడ్ చేసుకుని రామాటాకీస్ ఏరియా లోని పల్లపోతు వాసుకి చెందిన రైస్ మిల్ లో విక్రయించేందుకు వెళ్లినట్లు సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ సిఐ పుల్లయ్య సిబ్బందితో కలిసి పట్టుకోవడం జరిగింది.ఈ దాడులలో టాస్క్ఫోర్స్ సిబ్బంది జగన్,సాయి కిరణ్ లు పాల్గోన్నారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ అక్రమంగా సంపాదించాలని ఆలోచనతో పేద ప్రజలకు చెందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని ఎవరైనా అక్రమంగా తరలిస్తే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ పుల్లయ్య తెలిపారు. అనంతరం పట్టుబడ్డ నిందితులను వన్టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సిఐ రాజు తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: