CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అశ్వారావుపేట మరియు మండలంలో అన్ని రకాల వ్యాపారాలు 1 గంట వరకే తెరిచి ఉంచాలి. -ఎంపీపీ

Share it:

 


 మన్యంటీవీ, అశ్వారావుపేట:

 అశ్వారావుపేట మండలం లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం బంద్ నేటితో ముగియనున్నప్పటకి, అశ్వారావుపేట మండలంలో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టనందున ఈ బంద్ ను ఇలానే ఇంకా కొన్ని రోజులు కొనసాగుంచాలని, అశ్వారావుపేట లోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో  అశ్వారావుపేట    వ్యాపారస్తులు అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి అధ్యక్షతన  సమావేశం అవ్వటం జరిగింది.  మధ్యాహ్నం 1 గంట వరకె  అశ్వారావుపేట మరియు మండలంలోని ప్రతి ఒక్క వ్యాపార సముదాయాలు మూసి వేయాలని తీర్మానం చేయటం జరిగింది. అలాగే ఈ సారి కరోనా తీవ్రత వలన మరల సమావేశం పెట్టకుండా అశ్వారావుపేట, మరియు పెరయిగూడెం సర్పంచులు, మరియు రెవెన్యూ అధికారులు కలిసి కరోన తీవ్రత దృష్ట్యా మరల 09/06/2021  గురువారం నుండి 19/06/2021 శనివారం వరకు ఉదయం 6  గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే షాపులు  తెరచి ఉండాలని అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి, ఏంపీఓ  సీతారామరాజు మరియు అశ్వారావుపేట సర్పంచ్ అట్టం రమ్య, పేరాయి గూడెం సర్పంచ్ నర్లపాటి సుమతి తదితరులు ఎకగ్రీవం తీర్మానం చేయటం జరిగింది. కావున 1 గంటల తర్వాత షాపులు తెరిచి ఉంచి నిబంధనలను అతిక్రమిస్తే 5000 వేళా రూపాయలు ఫైన్ వేస్తారని తెలిపారు. మండలం లో ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలకు కట్టుబడి సహకరించాలని కోరారు. ఈ బంద్ కి అన్ని గ్రామాల ప్రజా ప్రతినిదులు సహకరించగలరని తెలిపారు.

Share it:

Post A Comment: