CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

లాక్ డౌన్ జూలూరుపాడు మండలం లో సత్ఫలితాలను ఇస్తోంది...

Share it:

 






మన్యం టీవీ : జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,  జూలూరుపాడు మండలం లో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సత్ఫలితాలను ఇస్తోంది. గత మూడు రోజుల క్రితం వరకు రోజుకి సుమారు నలభై పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ,కానీ గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తూ నేడు ఆదివారం కేవలం అయిదు కేసులు నమోదు కావడం హర్షించదగ్గ విషయం. కానీ మండలం  లో ప్రస్తుతం ఉన్న కరోనా కేసులు విషయంలోనే ఆందోళన వ్యక్తమవుతోంది, మరణాల సంఖ్య పెరుగుతోంది, నేడు సూరారం లో ఒక వ్యక్తి మృతి చెందారు. స్థానిక వైద్యాధికారి బి వీరబాబు, కరోనా తో బాధపడుతున్న వారు తగు సూచనలు సలహాల కోసం తన వ్యక్తిగత నెంబర్, 9885602463 మండల ప్రజలకు తెలియజేయడం జరిగింది. మండలంలో కరోనాతో బాధపడుతున్నవారు ఈ నెంబర్ కి ఫోన్ చేసి సలహాలు పొంది ప్రాణాపాయ స్థితి నుండి బయటపడాలని వైద్యాధికారి కోరుతున్నారు. నేడు ఆదివారం జూలూరుపాడు మండలం లో 23 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా గుండ్ల రేవు 2, రామచంద్రాపురం 1, పాపకొల్లు 1, వినోబా నగర్ 1, కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మండలంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గడానికి అధికారులు ,ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు, తమవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న. ప్రథమంగా మండల ప్రజలు అభినందిచాల్సింది పోలీసు శాఖను .మండుటెండలో మిట్టమధ్యాహ్నం సైతం సీఐ నాగరాజు, పర్యవేక్షణలో ఎస్సై శ్రీకాంత్, ట్రైనీ ఎస్ఐ   పి వి ఎన్ రావు, సిబ్బంది, మండల కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాలలో విస్తృతంగా గస్తీ నిర్వహిస్తూ బయట తిరిగే వారిపట్ల ఒకింత కఠినంగానే వ్యవహరిస్తూ, కేసులు నమోదు చేస్తూ లాక్ డౌన్ కట్టడికి కృషి చేస్తున్నారు. కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టేందుకు మండల ప్రజలు సైతం లాక్ డౌన్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.                                        సంఘం నాగరాజు,                   మన్యం టీవీ రిపోర్టర్, జూలూరుపాడు.

Share it:

POLITICS

Post A Comment: