CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మాతృమూర్తులకు అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గ ప్రజలకు అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.స్వగ్రామం కరకగూడెం లో విప్ రేగా కాంతారావు తల్లి నర్సమ్మ ను కలిసి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విప్ రేగా కాంతారావు సతీమణి సుధారాణి కి కుమారులు నవదీప్ దొర,వ్యోమ చంద్రదీప్ దొర మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా కుమార్తె రేగా వర్షిత మాతృ మూర్తి రేగా కాళికా కు మరియు రేగా సుధారాణి కి అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పదని,ఎంతో స్వచ్ఛమైనదని అన్నారు. ఓర్పు,సహనం,ప్రేమ,త్యాగం వంటి ఎన్నో సుగుణాలను మనం తల్లి నుంచే నేర్చుకుంటామని,ఒక మనిషి ఎదుగుదలకు మాతృమూర్తి పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.మహిళలు, మాతృమూర్తుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: