CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అంతర్జాతీయ నర్స్ డే సందర్భంగా ములుగు ఏరియా హాస్పిటల్ లో నర్సులను శాలువాలతో సన్మానించి చీరలను అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

Share it:

 



ఆక్సిజన్ సిలిండర్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలి.

మన్యం టీవీ ఏటూరు నాగారం:

ములుగు ఏరియా హాస్పిటల్ లో అంతర్జాతీయ నర్సు డే  సందర్భంగా నర్సులను శాలువాలతో సన్మానించారు. చీరలను అందించిన ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరగని చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ ఎంతటి వారికైనా ఓదార్పును అందిస్తున్నారు.  ఈ విపత్కర సమయంలో నర్సులే బాధితులకు కొండంత అండగా ఉంటున్నారు.కరోనా వైరస్ కట్టడి చేసేందుకు వైద్యులతో పాటు నర్సులు ఇతర వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి కంటికి కనిపించని వైరస్ తో యుధ్ధం చేస్తున్నారు. కరోనా వైరస్ కట్టడికి వేలసంఖ్యలో నర్సులు కంటి మీద కునుకు లేకుండా పని చేస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ వైరస్ తమనే అంతం చేస్తుందని తెలుసు, అయినా వారి లక్ష్యం ఒకటే బాధితులను ఆరోగ్యవంతులుగా ఇంటికి పంపించడం, ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అరికట్టేందుకు నర్సులు అహోరాత్రులు శ్రమించి ఉన్నారు. బాధితులకు చికిత్స మరియు సంరక్షణను అందిస్తున్నారు. వారి సేవలు వెలకట్టలేనివి ప్రమాదం అంచున నిలబడి వైరస్ బారిన పడిన వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. నిరంతరం రోగుల మధ్యనే ఉంటూ జబ్బులతో పోరాటం చేస్తూ ఉంటారు.రాత్రివేళల్లో సైతం డ్యూటీలు చేస్తుంటారు. పని ఒత్తిడిని ఎదుర్కోవడం,ఎదుటి వ్యక్తి బాధలను ఓపిగ్గా వినడం వారికి వృత్తిలో అలవాటు అయినా లక్షణాలు, ఓదార్పు మాటలు, రోగులకు మనోధైర్యాన్ని, ఆత్మ స్థైర్యాన్ని  కలిగిస్తూ వారి జబ్బులను సగం నయం చేస్తున్నారని అన్నారు. 

ఈ విపత్కర సమయములో ఒక యజ్ఞం వలె సేవలు అందిస్తున్న నర్సుల సేవలను వెలకట్టలేము. కరోనా సోకితే కన్న బిడ్డనైనా తాకలేము. బంధువులైన, ప్రాణ స్నేహితుడైన సరే దగ్గరికి రా లేరు ఒక రకంగా ఒంటరైన పేషెంటుకు హాస్పటలే దిక్కు అలాంటి పేషెంటు దగ్గరకు ఆత్మీయంగా వచ్చి సేవలందించే వ్యక్తి అన్ని తనై వ్యవహరించి అమ్మను మరిపిస్తుంది. కరోనా విలయంలో అమ్మ లాగా ఆదరిస్తూ కనిపించే దేవతలుగా వైద్య సేవలు అందిస్తున్న నర్సులు అందరకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సీతక్క.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోతు రవి చందర్, సర్పంచ్ రత్నం భద్రయ్య, ఎస్టీసెల్ మండల ఉపాధ్యక్షులు దేవ్ సింగ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: