CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇంటింటికీ నల్లా ఏదీ?

Share it:

 


నీరుగారుతున్న పథకం                       

                   

మన్యంటీవీ,అశ్వారావుపేట:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ నల్ల పథకం లక్ష్యాన్ని ఛేదించ లేకపోతుంది. కొత్తగా ఇచ్చిన కనెక్షన్లు నీళ్లు రాక, పాత కనెక్షన్లు పని చేయక గ్రామాల్లో జనాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మండలంలోని నారాయణపురం, బచ్చువారి గూడెం, మల్లాయిగూడెం, కొత్త మామిళ్ల వారిగూడెం పంచాయితీలో సుమారు 55 గ్రామాల్లో ఆరు నెలల క్రితం మిషన్ భగీరథ పైప్ లైన్లు ఏర్పాటు చేసి ఇంటికొక నల్ల ఏర్పాటు చేశారు. అంత వరకు బాగానే ఉన్నా ఇంతవరకు ఒక్క చుక్క నీళ్ళు కూడా రాక ప్రజలు తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ కొత్త పైప్ లైన్ లు  ఏర్పాటు చేసిన ఫలితం మాత్రం శూన్యం నీళ్లు రావడం లేదు అని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కనీసం అధికారులు పరిష్కారం చూపడం లేదని ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి . నీళ్లు సమస్య అధికంగా ఉండటంతో పంచాయతీ సిబ్బంది వారిని ఆశ్రయించగా మిషన్ భగీరథ పైపులైన్లు వల్ల నీటి కొరత ఏర్పడుతుందని చేతులు దులుపుకుంటున్నారు. నీళ్లు రావడం లేదని తెలిసి కూడా పంచాయతీ సిబ్బంది నీటి పన్ను బలవంతంగా ముక్కుపిండి డబ్బులు కట్టించుకుంటున్నారు. కానీ పరిష్కార మార్గం చూపడం లేదు. కొన్ని గ్రామాలలో మిషన్ భగీరథ పైపు లైన్లు ద్వారా ఏర్పాటు చేసిన నల్లాలు నిరుపయోగంగా ఉన్నాయి. అధికారులు దృష్టికి వెళ్ళినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా మండల అధికారులు చోద్యం చూడటం విడ్డూరం. మండలం మొత్తం మిషన్ భగీరథ పైపులైన్లు ఏర్పాటు చేసి ఇంటికో నల్ల ద్వారా త్రాగునీటి సరఫరా సాధ్యపడుతుందా లేదో వేచి చూడాలి.                                 


నల్లా ఇచ్చారు.. కాని ఇంత వరకూ నీళ్ళు రావడం లేదు

 గ్రామస్థురాలు శానంపూడి మణి


మా ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నల్లా కనెక్షన్ ఇచ్చారని కాని ఇంత వరకూ నీళ్ళు రావడం లేదని గ్రామస్థులు శానంపూడి మణి చెబుతుంది. నీళ్ళు ఎప్పుడు వస్తాయో అర్థం కావడం లేదని ఆ మహిళ వాపోతుంది. 


నీళ్ళు ఇవ్వడం లేదు కాని నీటి పన్ను కట్టించుకుంటున్నారు:దైద పరిశుద్ధ 


మా ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చారు గాని నీళ్ళు ఇంత వరకూ రాలేదని పంచాయతీ వారు మాత్రం పన్నులు బలవంతంగా కట్టించు ఉంటున్నారని గ్రామస్థులు దైద పరిశుద్ధ అంటున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: