CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఈటల రాజేందర్ పై చేసిన ఆరోపణలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు

Share it:

 


 -బహుజనుల నాయకులు  కొంకతి.


మన్యం టీవీ మంగపేట.

రాజేందర్ పై భూ కబ్జా నెపంతో తప్పుడు ఆరోపణలు చేసిన సీఎం కేసీఆర్ బీసీ సామాజిక వర్గాల ఆగ్రహనికి గురి కాక తప్పదని తెలంగాణ గంగ పుత్ర మహాసభ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొంకతి సాంబశివ రావు  ఒక పత్రిక ప్రకటన ద్వార తెలియజేసారు . విలేకరులతో మాట్లాడుతూ  సీఎం కేసీఆర్ తన కుమారుడిని  ముఖ్యమంత్రి చేయడానికి బిసి కులానికి చెందిన ఈటెల రాజేందర్ పై భూ కబ్జా నెపం వేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవి నుంచి తప్పించారని అన్నారు. రాష్ట్ర ఉద్యమ కారుడు తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకులలో ఒకరైన ఈటెల రాజేందర్ మీద భూకబ్జా నెపం వేయడమే కాకుండా కరోనా సమయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసి వెంటనే విజిలెన్స్ డిపార్ట్మెంట్ అధికారులను పంపించి ఓ పక్కన విచారణ జరుగుతుండగానే బిసి సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవి నుండి తొలగించడం బీసీలను అణగదొక్కడమే అని మండిపడ్డారు.కేటీఆర్ ను ముఖ్య మంత్రిని చేయడానికి ఈటెల రాజేందర్ పై కుట్ర చేశారని ఆరోపించారు.సీఎం కేసీఆర్ కు బీసీలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వచ్చాయని గంగపుత్రుల మహా  సభ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొంకతి సాంబశివరావు హెచ్చరించారు.....

Share it:

POLITICS

Post A Comment: