మన్యం మనుగడ, పినపాక: రంజాన్ మాసమును పురస్కరించుకుని, పినపాక మండలం లోని ముస్లిం సోదరీమణులకు తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు పినపాక మండలం లోని తహసీల్దార్ కార్యాలయంలో ముస్లిం సోదరీమణులకు పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో బట్టల పంపిణీ కార్యక్రమం చేశారు. మండలంలోని ముస్లిం సోదరీమణులు అంతా ఈ కార్యక్రమానికి విచ్చేసి, బహుమతిగా అందించిన బట్టలను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో పినపాక మండల తాహసిల్దార్ వెంకట విక్రమ్ కుమార్, డిప్యూటీ తాహసిల్దార్, యూ డి సి రాజేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ గణపతి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: