CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మండలంలోని పలు గ్రామాలను సందర్శించిన ప్రభుత్వ వైద్యాధికారిణి-ప్రియాంక

Share it:

 


మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: అన్నపురెడ్డిపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిణి- ప్రియాంక. కోవిడ్-19 సర్వేలో భాగంగా, కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న గ్రామాలను సందర్శించారు. కరోనా కేసులు అధికంగా గల గ్రామపంచాయతీలోని ఆశా కార్యకర్తలకు, అంగన్వాడి టీచర్లకు, ఎంపిహెచ్ఎ(ఎఫ్) లకు కరోనా పై పలు సలహాలు, సూచనలు ఇచ్చి, కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ఎర్రగుంట (పెద్దిరెడ్డిగూడెం) గ్రామంలోని మ్యాంగో మార్కెట్ యార్డులో పనిచేస్తున్న కార్మికులకు, యాజమాన్యానికి కోవిడ్-19 పై అవగాహన చేసి, మాస్కులు ధరించడం, శానిటైజర్ చేసుకోవడం, సామాజిక దూరం పాటించటం వంటి మరికొన్ని జాగ్రత్తలను తెలియజేశారు. ఏ మాత్రం ఆరోగ్యం నలతగా ఉన్నా, ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్షలు చేయించుకొని, చికిత్స పొందాలని, ఆలస్యం చేయవద్దని కోరారు. బుచ్చన్నగూడెం గ్రామంలోని స్కూల్ నందు,ఆ గ్రామ ప్రజలకు కోవిడ్-19 ప్రస్తుత పరిస్థితులను వివరించి, దోమతెరలు పంపిణీ చేశారు. దోమతెరలు వాడటం వలన ప్రజలు సీజనల్ వ్యాధుల బారినపడకుండా ఉంటారని, ప్రజల ఆరోగ్య దృశ్య విధించిన లాక్ డౌన్ నిబంధనలను అందరూ తప్పకుండా పాటించాలని, అత్యవసరం వస్తే తప్ప, బయట సంచరించవద్దని వ్యాఖ్యానించారు. ఈ సందర్శనలో వారి వెంట డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్-ఐ వెంకటేశ్వరరావు, ఆరోగ్య విస్తరణాధికారి-పోలెబోయిన కృష్ణయ్య, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: