CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అభాగ్యులకు అండగా నిలబడదాం

Share it:

 


-సామాజిక సేవలో నందులచెలక యువత

-బ్యూటిఫుల్ లైఫ్ అసోసియేషన్ నిత్యావసర సరుకులు అందజేత

- భిక్షాటకులకు ప్రతి రోజు భోజనాలు ఏర్పాటు


 దుమ్ముగూడెం మన్యం టీ వి ,మే 20: కులం,మతం,ప్రాంతం,జాతి,రంగు అనే తారతమ్యాలు లేకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా మనషులంతా ఒక్కటే అభాగ్యులకు అండగా నిలబడదాం మానవత్వాన్ని కాపాడుదాం అనే నినాదంతో సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న మండలంలోని బ్యూటిఫుల్ లైఫ్ అసోసియేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు గురువారం నాడు నందులచెలక యువతకి 25 కేజీల బియ్యం,నిత్యావసర సరుకులు,కూరగాయలు అందించారు.వివరాల్లోకి వెళితే నందులచెలక యువకులు కరోన పరిస్థితుల దృష్ట్యా ఆకలితో అలమటించే రోడ్డు సైడ్ బిక్షాటకులకు,మతి స్థిమితం లేని అభాగ్యులకు వారి సొంత డబ్బులతో మరియు కొందరి దాతల సహకారంతో వారికి ప్రతి రోజూ భోజనాలు ఏర్పాటు చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరి సేవలను గుర్తించిన స్థానికంగా గల బ్యూటిఫుల్ లైఫ్ అసోసియేషన్ వారు నిత్యావసర సరుకులు అందజేసారు.బిఎల్ఏ ఉపాధ్యక్షుడు కణితి రాజు మాట్లాడుతూ సామాజిక సేవలలో ముందుంటున్న నందులచెలక యువతకి మరియు ఇలాంటి సేవలందించే యువతకి ప్రతి ఒక్కరూ మంచి మనస్సుతో సహాయ సహకారాలు అందిస్తే సమాజం అందమైన సమాజంగా రూపుదిద్దుకుంటుంది అని ఆయన ఈ సందర్భంగా అన్నారు.నందులచెలక యువత మాట్లాడుతూ మా యువత నుండి మరియు మా నందులచెలక ఊరి నుండి బ్యూటిఫుల్ లైఫ్ అసోసియేషన్ కి ఫుల్ సపోర్ట్ గా ఉంటామని వారు ఈ సందర్భంగా మాట్లాడారు.పలువురు వీరి చేసే సేవలను చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.నందుల చెలక యువత వర్సా రామకృష్ణ,సోడి సురేష్,సోయం రాజేష్,సోయం దశరథుడు,సోయం సురేష్,సోయం రాజు,సోయం ధర్మరాజు,గుండి శేఖర్,సోడి జంపన్న,సోయం రాజుకుమార్.

Share it:

TELANGANA

Post A Comment: