CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా ను ఆరోగ్యశ్రీలో చేర్చాలి.

Share it:

 


ప్రతి గ్రామంలోని రైతు వేదికను క్వారంటైన్ గా  మార్చాలి.

 

మండలం లో ఇంటింటి సర్వే చేస్తున్న ఆయా శాఖల సిబ్బందికి 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలి.

లాక్ డౌన్ లో పేద ప్రజలను ఆదుకోవాలి.

మన్యం టీవీ మంగపేట.


ఎస్ఎఫ్ఐ ఆలిండియా కమిటీ పిలుపులో భాగంగా ఇంటి  దగ్గర ప్లకార్డులతో నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా *SFI  ములుగు జిల్లా అధ్యక్షుడు తోకల రవి మాట్లాడుతూ..

 దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా వ్యాపిస్తుంది. కరోనా ను అరికట్టే విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి.కేంద్ర ప్రభుత్వం రాష్ట్రలకు పంపించే  వ్యాక్సిన్ విషయంలో చాలా అలసత్వంగా వ్యవహారిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలకు వ్యాక్సిన్ ఉచితంగా అందించాలి.రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా రోగులకు ఆక్సిజన్,బెడ్లు, మందులు లేకపోవడంతో చాలామంది ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.దీంతో ప్రైవేటు ఆస్పత్రుల  యాజమాన్యాలు కరోనా ను అడ్డంపెట్టుకొని వైద్య వృత్తిని వ్యాపారంగా మారుస్తూ  దాదాపు 10 నుంచి 20 లక్షలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.ధనవంతులకు మాత్రమే ఈ వైద్యం అందుతుంది.ఇలా ఉంటే రాష్ట్రంలోనే పేద ప్రజల పరిస్థితి ఏమిటి..?దీనిని నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉన్న  ప్రభుత్వం మాత్రం దీనిపై మాట్లాడటం లేదు.పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందాలంటే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి.అదే విదంగా రోజురోజుకు గ్రామాల్లో             పేరుగుతున్నటువంటి కరోనాను అరికట్టే విషయంలో  ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించాలి.ప్రతి గ్రామంలోని  ఒక రైతు వేదికను ఒక క్వారంటైన్ గా మార్చాలి. కరోనాను అరికట్టే విషయంలో  ఇంటింటి సర్వే చేస్తున్న ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు, ఇతర శాఖల అందరికీ రక్షణ కల్పించాలి. అత్యధికంగా కరోనా విజృంభిస్తున్న ప్రాంతాలలో ప్రత్యేకంగా అధికారుల దృష్టి పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుకునే దిశగా ఆక్సిజన్ తో కూడిన  ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  పెట్టినటువంటి లాక్ డౌన్  విషయంలో చాలా మంది పేద ప్రజలు ఉపాధి లేక తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ఉచితంగా నెలకు సరిపడా నిత్యావసర సరుకులు,ప్రతి కుటుంబానికి నెలకు 8 వేల రూపాయలు ఇవ్వాలి.  

డిమాండ్స్: 

1.) దేశ ప్రజలందరికి ఉచితంగా కోవిడ్ వ్యాక్సీన్ అందించాలి. టికా హక్కులు అన్ని రాష్ట్రాల కు కల్పించాలి.

2.)ఆక్సిజన్, బెడ్లు, ఇంజక్షన్స్, మందుల బ్లాక్ మార్కెట్ ను నియంత్రించాలి.

3.)హెల్త్ కేర్ వర్కర్లకు మరియు ఆక్సిజన్ సరాఫరా వర్కర్లకు, అంత్యక్రియలు నిర్వహించే వారికి 50 లక్షలు బీమా సౌకర్యం  కల్పించాలి.

4.)తెలంగాణ రాష్ట్రంలో కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చి నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలి.

5.)కార్పోరేట్, ప్రైవేట్ హస్పటల్స్ ఫీజుల దోపిడిని ఆరికట్టాలి.

Share it:

TELANGANA

Post A Comment: