CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బాధిత కుటుంబాలకు ఆర్ధిక సహాయం

Share it:

 


* ములుగు ఏఎస్పి సాయి చైతన్య

*కెటిఆర్ స్ఫూర్తి తోనే నిత్యావసర సరుకుల పంపిణీ

*టిఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ ఏరువ సతీష్ రెడ్డి.

మన్యం టీవీ గోవిందరావుపేట

కరోనా కష్టకాలంలో పేద ప్రజల ఆకలిని తీర్చేందుకు సాయం చేసే చేతులే మిన్న అని ములుగు ఏఎస్పి సాయి చైతన్య అన్నారు. శనివారం గోవిందరావుపేట మండల కేంద్రంతో పాటు పసర చల్వాయి, మోట్ల గూడెం తదితర గ్రామాల్లో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ ఏరువ సతీష్ రెడ్డి 400 కుటుంబాలకు సమకూర్చిన నిత్యావసర సరుకులను గుత్తి కోయ, పేద ప్రజలకు, వికలాంగులు,వితంతు, గ్రామ పంచాయతీ సిబ్బందికి అందించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ సతీష్ రెడ్డి కరోనా పేషెంట్లను ఆదుకునేందుకు హైదరాబాదులో చేపడుతున్న కార్యక్రమాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని ములుగు జిల్లాలో సైతం పేద ప్రజలను సాయం చేయాలని విజ్ఞప్తి చేయగా స్పందించి సాయం చేసేందుకు ముందుకు వచ్చారని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సతీష్ రెడ్డి చేస్తున్న సాయం గొప్పదని ఆయన ప్రశంసించారు. ప్రతి ఒక్కరు సతీష్ రెడ్డి ని స్పూర్తిగా తీసుకొని సాయం చేసేందుకు ముందుకు రావాలని ఏఎస్పీ పిలుపునిచ్చారు.

సతీష్ రెడ్డి మాట్లాడుతూ

కెటిఆర్ స్ఫూర్తి తోనే నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్నానని టిఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ ఏరువ సతీష్ రెడ్డి అన్నారు.

కరోనా కష్టకాలంలో పేద ప్రజలను ఆదుకోవాలని మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తనవంతుగా సాయం చేస్తున్నానని సతీష్ రెడ్డి తెలిపారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం లాక్ డౌన్ విధించిందని అన్నారు. ఈ సమయంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు దాతలు ముందుకు రావాలని అని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు తమ ఇళ్ల చుట్టూ ఉన్న పేదలను గుర్తించి వారికి తోచిన విధంగా సహాయం చేయాలని అన్నారు. కరోనా సోకిన రోగులు ధైర్యంతో ఉండి ప్రభుత్వం అందించే మందులను వాడాలని అని అన్నారు. ప్రజలు విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరాలను పాటించి కరోనా నియంత్రణకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ పార్టీ పేదలను ఆదుకోవడంలో ఎల్లపుడు ముందుంటుందని అని ఆయన అన్నారు. తన వంతుగా ఒక్కొక్క కుటుంబానికి ఒక నెలకు సరిపోయేలా నిత్యావసర సరుకులు బియ్యం, పప్పు, నూనె, ఉప్పు, ఉల్లిపాయలు, కూరగాయలు, పసుపు, కారం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సుడి శ్రీనివాస్ రెడ్డి, పస్రా సిఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై రవీందర్, మురారి బిక్షపతి, సాయిబాబా, యం పి టి సి స్వరూప, మురళి చందర్, శ్రీనివాస్, సమ్మిరెడ్డి, బూరెడ్డి మదు, శివ, రాజశేఖర్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: